నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న మద్దతు ధర సోయా పంట కొనుగోలను ఈనెల ఏడవ తేది వరకు పొడిగించినట్లు జిల్లా మార్క్ఫెడ్ అధికారులు జారీ చేసిన సర్కులర్ లో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు 9 ఉన్నట్లు జనవరి ఒకటి 2025 నాటికి జిల్లాలో మొత్తం 8071 మంది రైతుల నుండి 1,37,871 క్వింటాళ్లు సోయా పంట కొనుగోలు జరిగినట్లు తెలిపారు. మార్క్ ఫెడ్ ద్వారా సోయా పంటకు క్వింటాలుకు 4892 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగిందని, ఆ సర్కులర్ లో పేర్కొనడం జరిగింది కామారెడ్డి జిల్లాలో మొత్తం సోయా పంట సాగు 91935 ఎకరాలు చేసినట్లు తెలిపారు. తదుపరి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈనెల ఏడవ తేదీ వరకు మాత్రమే సోయాబీన్ కొనుగోలు జరుగుతుందని తెలిపారు. సోయా పంట రైతులంతా గమనించాలని జిల్లా మార్క్ఫెడర్ అధికారి సర్కులర్ ద్వారా తెలియజేశారు.