ఎస్‌బీఐ చీఫ్‌ దినేష్‌ పదవీకాలం పొడిగింపు..!

న్యూఢిల్లీ : దిగ్గజ విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మెన్‌ దినేష్‌ ఖారా పదవీ కాలాన్ని పొడగించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే అక్టోబర్‌ ముగింపు నాటికి ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉంది. కాగా.. పది నెలల పాటు పదవీ కాలాన్ని పొడగించే అవకాశం ఉందని సమాచారం.