నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 30న ముగుస్తుండటంతో వాటిని మరో మూడు నెలలు (31 డిసెంబర్-24 వరకు) పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు గురువారం సర్క్యూలర్ జారీ చేశారు. తెలంగాణ మీడియా రూల్స్ 2016ను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తాజా మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయకపోవడం వల్ల పాత కార్డుల గడువును పెంచుతున్నట్టు సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.