గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అర్రెం లచ్చు పటేల్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్ డైరెక్టర్ తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో, మండల కేంద్రంలో బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సంక్షేమ, ఆరు గ్యారెంటీ హామీలను, మరియు పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రజలు ఆశీస్సులతో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. కాగా పడిగాపురం, ఎల్బాక గ్రామాల లో కూడా విస్తృతంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ కార్డులు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగారి రమేష్ సోషల్ మీడియా ఇన్ఛార్జి సాదు చక్రపాణి, ముఖాల బాలాజీ గంటసాయిరెడ్డి, అజయ్, శ్రీను, సూర్యం, సతీష్, గొప్ప ఉదయ్, తాటి మహేష్, సిద్దు, రేగ సాయిరాం, రాకేష్, రమాకాంత్, బంగారి సురేష్, పాండవుల సాయి, బంగారు అజయ్, బండారి లక్ష్మయ్య, గౌని మధు, జగన్, కారంగుల రాంబాబు, ఆకుల సమ్మయ్య, తోలెం కృష్ణ, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.