
మండలంలో గత మూడు రోజుల నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మరియు వీ వీ ప్యాట్, సంచార ప్రదర్శన వాహనం ద్వారా మండల వ్యాప్తంగా ఓటు హక్కు వినియోగం గురించి ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అనే అంశాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ సూచనల ప్రకారం ఎమ్మారై డేగల సాంబయ్య తన సిబ్బందితో బుధవారం కామారం(పిటి), గంగారం, కాటాపూర్, దామరవాయి దామరవాయి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో స్థానిక సర్పంచులతో కలిసి గ్రామ పెద్దలు గ్రామ ప్రముఖులు యువకులు, మహిళలతో ఓటు హక్కు ప్రాధాన్యత గురించి, వివరించారు. ప్రలోభాలకు లోను కాకుండా సేవ చేసే వ్యక్తులకు ఓటు వినియోగించుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఐ డేగల సాంబయ్య మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మారుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం గా ప్రకటించినది అని, కుల మత ప్రాంత లింగ జాతి భాష అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, జూనియర్ అసిస్టెంట్ జనగాం సాంబశివరావు, గ్రామాల పెద్దలు, మహిళలు, పోలీసులు, ఓటర్లు, ప్రజాస్వామ్యవాదులు తదితరులు పాల్గొన్నారు.