పెద్దతూండ్లలో ఎక్సైజ్ అధికారుల విస్తృత తనిఖీలు..

– రూ.1.20 లక్షల గుడుంబా తయారీ, ముడిసరుకులు పట్టివేత
– కిరాణ వ్యాపారితోపాటు పలువురుపై కేసులు నమోదు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూoడ్ల,దుబ్బపేట గ్రామాల్లో అక్రమంగా గుడుంబా తయారీ,విక్రయాలు,ముడి సరుకుల అమ్మకాల జోరుగా సాగుతున్నాయనే సమాచారం మేరకు కాటారం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  ఆదివారం తెల్లవారుజామున ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో 16 లీటర్ల గుడుంబా ఓ ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పట్టుకున్నట్లుగా తెలిపారు ద్విచక్ర వాహనంపై రవాణా చేస్తూ పట్టుబడినవారిని లోతుగా విచారించగా,వారిచ్చిన సమాచారం ప్రకారం నాటు సారా తయారీలో ఉపయోగించు ఈస్ట్ ప్యాకెట్లు,పంచదారను పెదతుండ్ల గ్రామంలో గల కిరాణ షాపు యందు అమ్మినట్లుగా తెలపగా, అట్టి కిరాణ షాపు యందు విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు ఈ తనిఖీల్లో 56 ప్యాకెట్ల ఈస్ట్ , ఒక్కో ప్యాకెట్ 500 గ్రాములతో మొత్తం 28 కిలోలు కలదని, 17 బ్యాగుల చక్కెర , ఒక్కో బ్యాగు 50 కిలోలతో మొత్తం 850 కిలోల చక్కెర మొత్తం రూ 1.20 లక్షల ముడిసరుకులు స్వాధీనం చేసుకొన్నట్లుగా తెలిపారు. గుడుంబా రవాణ చేసిన, అమ్మిన మరియు తయారీ కోసం వాడే ముడి సరుకును విక్రయించిన వ్యక్తులు అజ్మీరా సమ్మయ్య, అట్టెం రాజేందర్, కిరాణం ద్వారా సరఫరా దారుడు రెవెళ్లి సంతోష్  ముగ్గురిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి రెండు సెల్  ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు.ఈ దాడుల్లో కాటారం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ టి.నరేందర్, సబ్ సబ్ ఇన్స్పెక్టర్ బి.కిష్టయ్య, హెడ్ కానిస్టేబుల్ రామ్ చందర్, కానిస్టేబుళ్లు వెంకట్ రాజు, కోటేశ్వర్ , రామకృష్ణ పాల్గొన్నారు.