నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి హైదరాబాద్ నగరంలో పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలో రూ.5,31,61,970 నగదును సీజ్ చేశారు. గురువారం ఒక్కరోజే రూ. 27,12,390 నగదు, రూ. 8,23,500 విలువ గల ఇతర విలువైన వస్తువులతోపాటు 155.90 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేశారు.