మండల కేంద్రమైన తాడిచెర్లలోని పలు వార్డుల్లో మండల స్పెషల్ అధికారి ఆర్,అవినాష్ ఆదేశాల మేరకు శుక్రవారం పారిశుద్ధ్య నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లుగా పంచాయతీ కార్యదర్శి చెలకల రాజు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడారు మేజర్ గ్రామపంచాయతీలోని పలు వార్డుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికి కాల్వల్లో చెత్త,చెదారం తొలగించి, ఈగలు,దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ వేయించడం జరిగిందన్నారు.ఇంటింటా వైద్య సిబ్బందితో కలిసి నిల్వగా నీరు ఉండకుండా అవగాహన నిర్వహించడం జరిగిందన్నారు.అలాగే ప్రజల అసౌకర్యం కల్పించే, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గ్రామపంచాయతీ కార్యాలయం దృష్టికి తీసుక వస్తే వెంటనే చర్యలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.