
– రూ.1 లక్ష 62000 పట్టివేత
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ :
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ కు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. స్థానిక పోలీసులు కేంద్ర బలగాలతో గురువారం హుస్నాబాద్ పట్టణంలో నలుమూలల విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హుస్నాబాద్ సిఐ ఏర్రల కిరణ్ ఎప్పటికప్పుడు కేంద్ర బలగాల తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని ఏనే వద్ద హుస్నాబాద్ నుండి అక్కన్నపేటకు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడి వద్ద సరైన పత్రాలు లేని రూ .1,62000 రూపాయలను అక్కన్నపేట ఎస్సై తాండ్ర వివేక్ పట్టుకొని ఎన్నికల అధికారులకు అప్పగించారు. 50 వేలకు మించి వాహనాల్లో పట్టుకెళ్తున్న డబ్బుకు సరైన లెక్క పత్రాలు చూపించాలని సిఐ కిరణ్ తెలిపారు. నవంబర్ 30 న ఎన్నికలు అయిపోయేంత వరకు ప్రతిరోజు వాహనాల తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.