రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టాలి

– ప్రజా సంఘాల ఆధ్వర్యములో డిఎమ్ కు వినతి పత్రం అందించారు.
నవతెలంగాణ-సిరిసిల్ల
జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్లర్లు రైతుల నుండి తరుగు పేరుతో తూకం ఎక్కువ వెయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పౌరసరఫర శాఖ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే అకాల వర్షాల కారణంగా చాలామంది రైతులు వడగండ్ల వానలతో నష్టపోయారని పంట కోసిన తర్వాత అమ్ముకునే సమయంలో రైతు మిల్లర్ల దోపిడి వల్ల మరింత నష్టపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని ఏలాంటి తరుగు లేకుండా కొంటామని చెప్పినప్పటికీ మిల్లర్లు మాత్రం ప్రభుత్వ మాటలను పట్టించుకోకుండా తరుగు తీస్తున్నారని అన్నారు. ఒక బస్తా వెంబడి నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తరుగు పేరు మీద  కటింగ్ చేస్తున్నారని, దీంతో పేద రైతులకు పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని అన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల తో రైస్ మిల్లర్లు ఒక ఒప్పందం తో ఈ దోపిడీ జరుగుతుంది అని ఆరోణలున్నాయి. విటిపైన కూడా విచారణ జరపాలని కోరారు. వెంటనే  అధికార యంత్రాంగం తరుగు వేస్తూ రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లులపై తగిన చర్యలు తీసుకోనీ రైతుల కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.