పేద కుటుంబాన్ని ఆదుకున్న ఎక్స్ట్రామైల్ పౌండేషన్

Extramile Foundation which supports poor family– ఇల్లు కురవకుండా టర్పంటైన్ అందించిన నాగమోహన్
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా దామర గ్రామం కి చెందిన సంది నరసింహ ,ఎల్లమ్మ దంపతులకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు గత కొంత కాలం క్రితం అకాల మృతి చెందారు.వృద్ధాప్యంలో ఉన్న ఈ  దంపతులు ప్రభుత్వం నుండి ఎటువంటి పెన్షన్ పొందటం లేదు. వీరు నివాసం ఉంటున్న సిమెంటు ఇటుకల ఇల్లు వానలకు బాగా కురుస్తూ చాలా ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ,సామాజిక కార్యకర్త గురిజ మహేష్ వారి ఇల్లు తాత్కాలిక మరమ్మత్తుకు సహాయం అందించమని, ఏదైనా ఉపాధి అవకాశం కల్పించమని అడిగారు.వీరు పరిస్థితిని ” ఎక్స్ట్రా మైల్  ఫౌండేషన్ స్థాపకులు నాగమోహన్ కు వివరించగా వారు వెంటనే స్పందించి  సిమెంటు ఇటుకల ఇల్లు కురవకుండా టర్పంటైన్ కవర్ను అందించి మానవత్వం చాటుకున్నారు. వారికి ఏదైనా ఉపాధి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ,సామాజిక కార్యకర్త  గురిజ మహేష్ వెంటనే స్పందించి సహాయం అందించిన ఎక్స్ట్రా  మైల్ ఫౌండేషన్ నాగమోహన్ కు గారికి వృద్ధ దంపతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.