స్వరాష్ట్రంలోనూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా పట్ల తీవ్ర వివక్ష

నవతెలంగాణ-హన్మకొండ
తొమ్మిది సంవత్సరాల బీఆర్‌ఎస్‌ పాలనలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానం నుండి ప్రస్తుతం (ఆరు కొత్త జిల్లాలు) చివరి ర్యాంకులో ఉన్నాయని తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరంఫర్‌ బెటర్‌ వరంగల్‌ సంయుక్తంగా ఏర్పా టు చేసిన చర్చాగోష్టిలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన నక్కలగుట్ట హరిత కాకతీయ హోటల్లో జరిగిన సభలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక వక్తలు మాట్లాడుతూ రాష్ట్రం సాధించిన తర్వాత వరంగల్‌ ఉమ్మడి జిల్లా అన్ని రంగాల్లో నష్టపోయిందని ఫోరం ఫర్‌ బెటర్‌ వరంగల్‌ అధ్యక్షులు పుల్లూరు సుధాకర్‌, సోమ రామ్మూర్తి, తిరునహరి శేషు, డాక్టర్‌ వీరస్వామి, శివరాత్రి దుర్గయ్య, నరోత్తంరెడ్డి, ఈశ్వర్‌ సింగ్‌, సాయిని నరేందర్‌, శశికాంత్‌ మొదలగువారు పేర్కొన్నారు. జిల్లా నాయకత్వం రాజకీయ చైతన్యాన్ని కోల్పోయి విద్య, వైద్యం, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల అభివద్ధిని పట్టించుకోలేదన్నారు. జిల్లా నాయకులు తమ సీటు కాపాడుకోవడానికి బాసు భజ న చేయడమే సరిపోయిందని విమర్శించారు. రాష్ట్రం దురదష్టవశాత్తు కుటుంబ పాలన, నిరంకుశత్వం, ఆధిపత్య పరిపాలనలో పడిపోవడం వల్ల జిల్లా స్థానిక నాయకత్వం కేవలం మంత్రి పదవులు, ఎమ్మెల్యే సీట్లు అడుక్కునే స్థాయికి దిగజారి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన అభివద్ధి కార్యక్రమాలను తీసుకురాలేకపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం కేంద్రంతో తగవులాడుతూ వరంగల్‌ కు రావలసిన కోచ్‌ ఫ్యాక్టరీని రాకుండా చేశారని, స్మార్ట్‌సిటీ నిధులు ఉపయోగించు కోలేక పోయినందుకు ఏటూర్‌నాగారం కమలాపూర్‌ రేయాన్స్‌ ఫ్యాక్టరీని తెలం గాణ ప్రభుత్వమే మూసివేసిందన్నారు. రైతుల భూములను కారుచౌకగా స్వాధీ నం చేసుకొని ఏర్పాటు చేస్తానన్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఈనాటికి ఒక్క స్థానికునికి కూడా ఉద్యోగం కల్పించలేక పోయిందన్నారు. వరంగల్‌ నగరాన్ని డ ల్లాస్‌ చేస్తామని చెప్పిన సీఎం ఉమ్మడి వరంగల్‌ జిల్లాను ఖల్లాస్‌ చేశాడన్నారు.
70 ఎకరాల జైలు ప్రాంగణాన్ని, భవనాలను కూలగొట్టి భూములను రూ.11 వేల కోట్లకు మహారాష్ట్ర బ్యాంకుకు తాకట్టు పెట్టిండ్రు. జైలు భూములను కూడా అమ్ముకోవడానికి నాలిక సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలకు కనీస సౌకర్యాలు, డాక్టర్లు లేక కేవలం బోర్డు మాత్రమే ఏర్పాటుచేసి చేతులు తెలుపుకున్నారన్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, సీకేఎం, ఎల్‌బీ కళాశాలలు, కాకతీయ యూనివర్సిటీ నిధులు, నియామాకాలు లేక బాలికలకు టాయిలెట్స్‌ కూడా గతిలేక, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లభించక ఈ సంస్థలు మూసివేత దశకు చేరుకున్నాయన్నారు. రాష్ట్రంలో అభివద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ అని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆవేదన పడుతున్నారు. ఉమ్మడి జిల్లా నాయకులు ఆ కుటుంబ సభ్యుల నియోజకవర్గం సందర్శించి అక్కడి అభివద్ధిని అవగాహన చేసుకుని రావలసినదిగా విజ్ఞప్తి చేశారు. డోర్నకల్‌, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, పాలకుర్తి నియోజకవర్గాలు మొత్తం రాష్ట్రంలోని అట్టడుగున ఉన్న ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందని కేంద్రంతో రాజకీయ క్రీడ పంచాయతీలు చేస్తూ కేంద్రం నుండి రావలసిన వేల కోట్ల రూపాయల గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వ, బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకుంటున్నారన్నారు.