నవతెలంగాణ- ధూల్‌పేట్
ఉస్మానియా ఆస్పత్రిలో కంటి ఆపరే షన్లు పునః ప్రారంభం చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ అన్నారు. ఆస్పత్రి లో పునరుద్ధరించిన నేత్ర వైద్య ఆపరేషన్ థియేటర్‌ను శుక్రవారం ఆయన దాత పరేఖ్, పునరుద్ధరణ పనుల ను విరాళంగా అందించిన రోగి సహాయ ట్రస్ట్ ట్రస్టీలతో కలిసి ప్రారం భించారు. ఈ ఆఫ్తాల్మాలజీ ఆపరేషన్ థియేటర్ ప్రారంభోత్సవంలో అడిషనల్ సూపరిం టెండెంట్ డాక్టర్ బి.త్రివేణి, ఆర్‌ఎంఓలు, ఇతర సిబ్బందితో పాటు డిపార్ట్‌మెంట్ ఫ్యాకల్టీ, నేత్రవైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అతుల్ గుప్తా, ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి లో నేత్ర చికిత్సలతో పాటు ఆపరేషన్ సేవ లను రోగులు ఇక్కడ పొందవచ్చని తెలిపారు. చికిత్సలు పొందే రోగులు ఇక్కడ నుండి సరో జినీ, ఇతర ఆసుపత్రులకు వెళ్లేందుకు రోగు లు ఇబ్బందులకు గురికావడంతో ఈ సేవల ను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలి పారు. రోగులు ఇబ్బందులకు గురి కాకుండా మెరుగైన వైద్య సేవలు కల్పిస్తు న్నామన్నారు. ధియేటర్‌కు సహకరించిన కరుణామయ విరాళానికి కతజ్ఞతలు తెలిపారు. పరేఖ్ రోగి సహాయత్గా ట్రస్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు.