సరోజినీ ఆస్పత్రిలో వరవరరావుకు కంటి పరీక్షలు

సరోజినీ ఆస్పత్రిలో వరవరరావుకు కంటి పరీక్షలునవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
విరసం నాయకుడు వరవరరావు కు సరోజినీ దేవి నేత్ర వైద్యశాలలో కంటి పరీక్షలు నిర్వహించారు. ముంబయి నుంచి బెయిల్‌పై విడుద లైన వరవరరావు శంషాబాద్‌ విమానా శ్రయం నుంచి నేరుగా హైదరాబాద్‌ మెహిదీపట్నం సమీపంలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌, సర్జన్‌ డాక్టర్‌ రాజలింగం ఆయనకు కంటి శుక్లం వద్ద శస్త్రచికిత్స చేశారు. ఈ శస్త్రచికిత్సను వైద్య పరిభాషలో మల్టీఫోకల్‌ ఫోల్బుల్‌ ఐయోలతో ఉన్న ఫాకో అంటారని రాజలింగం తెలిపా రు. కొన్ని మందులను వాడాలని సూచించినట్టు వివరించారు.