అఖిల్‌కు ఎఫ్‌4 టైటిల్‌

అఖిల్‌కు ఎఫ్‌4 టైటిల్‌– ఇండియన్‌ రేసింగ్‌ ఫెస్టివల్‌
కోయంబతూర్‌ : హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ డ్రైవర్‌ ఆఖిల్‌ అలీభారు ఎఫ్‌4 ఇండియన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. రుహాన్‌ అల్వ (బెంగళూర్‌) ఆఖరు రేసులో టాప్‌ పొజిషన్‌లో నిలిచినా.. రేసు ఆరంభానికి ముందే 29 పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన ఆఖిల్‌ అలీభారు చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సీజన్‌లో ఆరు విజయాలు సాధించిన అఖిల్‌.. ఆదివారం రెండుసార్లు పొడియంపై నిలిచాడు. అఖిల్‌ను హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ సహ యజమాని అక్కినేని నాగచైతన్య అభినందించారు.