ఆర్జీయూకేటీ బాసరకు నూతన వీసీగా నియమితులైన ప్రొఫెసర్ గోవర్ధన్ ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు మంగళవారం కలిశారు. గ్రామీణ పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయానికి సాంకేతిక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసిన, పరిపాలన అనుభవం, సమర్థత కలిగిన ప్రొఫెసర్ గోవర్ధన్ ను ప్రభుత్వం వీసీగా నియమించడం ఎంతో సంతోషకరమని సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీ స్థాపించినప్పటి నుండి పనిచేస్తున్న అధ్యాపకులు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, సహాయ సహకారాలు అందించాలని వీసీ సూచించారు. సమన్వయంతో పని చేస్తే పురోగతి సాద్యమని పేర్కొన్నారు. ఈసందర్భంగా వీసీని అధ్యాపక సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీచింగ్ ఎంప్లాయ్ అసోసియేషన్ మాస్టర్ అధ్యక్షులు శ్రీశైలం, జనరల్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్, సహకార దర్శులు సతీష్ కుమార్, డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ రాములు, వసంత్ బాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.