
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలోని శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతర ఆర్చ్ రంగులు లేక మసకబారి పోయిందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది రాజేష్ అన్నారు. బుధవారం పసర గ్రామంలోని మేడారం సమ్మక్క సారక్క ఆర్చిని ఆదివాసి గిరిజన సంఘం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ మేడారం జాతర ఫిబ్రవరి 21,22,23 తేదీళ్లలో జరగనుండగా నెల రోజుల ముందునుండే ప్రజలు వివిధ ప్రాంతాల నుండి తండోపాతండాలుగా వస్తున్నారని ఆయన తెలిపారు, ఈ క్రమములో జాతీయ రహదారి 163 కు అనుకుని ఉన్న పసర గ్రామము మీదుగానే మేడారం వెళ్లాల్సి ఉంటుందనే కారణంతో పసరలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క మేడారం జాతర ఆర్చ్ రంగులు లేక వెల వెల బోవడం చూసి బక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి జాతరకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈ ఆర్చ్ ని మాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్చ్ ఇలాగ ఉంటే జాతరలో పనులు ఏ స్థాయిలో ఉంటాయో అని మేడారం వెళ్ళక ముందే ప్రారంభంలోనే భక్తులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్లు తెరిచి మేడారానికి వెళ్లే ప్రదాన మార్గాలలో ఉన్న ఇలాంటి ఆర్చ్ లకు వెంటనే రంగులు వేసి కొత్తదనం తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.