
పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఐత అనిల్ ఆధ్వర్యంలో ఫ్యాడ్స్, పెన్నులు, స్కేలను ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీటీసీ ఐత రాంచందర్, దళిత రత్న అవార్డు గ్రహీతలు ఐత యాకయ్య, ఐత మల్లేష్, అంబెడ్కర్, బాబు జగ్జీవన్ రాయ్ విగ్రహాల కమిటీ అధ్యక్షులు ఐతరాజు అందజేశారు. విద్యార్థులు పరీక్షల్లో ఉన్నత ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గారె కృష్ణమూర్తి, అంబేద్కర్ సంఘం నాయకులు పీరని ప్రవీణ్, ఐత రవి, ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు కంతుల జంపి, రాకేష్, సాయి, సందీప్, పండు, తాటికల మహేష్, బైరపాక రాజు తదితరులు పాల్గొన్నారు.