రైతులను వణికిస్తున్న ఫెయింజల్ తుఫాన్ ..

Fainjal typhoon shaking the farmers..నవతెలంగాణ – మల్హర్ రావు
ఫెయిమ్జల్ తుఫాన్ ప్రభావం మండలంలో రైతులను వణికిస్తోంది. మండలంలో శనివారం చిదురు మొదురు చినుకులు కురుస్తుండడంతో రైతులు బెంబేలెత్తిపోయారు. కోసిన ధాన్యం ఆరబోసి కొందరు కాంటాలు వేసి బస్తాలలో నిలువ చేసి కొందరు ఇంకా కోయవలసిన పరిస్థితుల్లో పలువురు రైతులు ఉన్నారు. వాతావరణం మేఘావృతమై చల్లటి గాలులు వీస్తుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. తుఫాన్ ప్రభావంగా ఎక్కడ భారీ వర్షాలు పడతాయి అన్న భయం రైతులను వెంటాడుతోంది.ధాన్యం రాశుల మీద టార్పాలిన కప్పిన రైతులు గాలి వస్తే ఎక్కడ లేచిపోతాయోనన్న ధాన్యం ఎక్కడ తడిచిపోతుందోనన్న భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. తుఫాన్ తీరం దాటింది వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈదురుగాలులు వీస్తాయి అన్న వాతావరణ శాఖ ప్రకటనలతో రైతులు కుదేలవుతున్నారు. తుఫాన్ ప్రభావం నుండి బయటపడాలని రైతులు కోరుకుంటున్నారు. దిగుబడులు అన్హంగా తగ్గిన నేపథ్యంలో వర్షం వల్ల మరింత నష్టం సంభవిస్తుందోనన్న దిగులు రైతులకు పట్టుకుంది.ధాన్యం రాసులపై కప్పడానికి సబ్సిడీ టార్పాలిన్లు అందకపోవడంతో అద్దెకి తెచ్చి కప్పుతున్నారు.