– సీఐటీయూ మండల కన్వీనర్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-మొయినాబాద్
పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ మొయినాబాద్ మండల కన్వీనర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పంచాయతీ కార్మికుల మొదటి రోజు సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్‌ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. 51 జీవోను రద్దు చేయాలని, మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి న్యాయమైన డిమాండ్లను ఒప్పు కోవాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ మొయినాబాద్ నాయకులు రత్నం, ఆంజనేయులు గౌడ్ చంద్రశేఖర్ రాములు మాణిక్యం గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు