
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురువారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి రంగానికి న్యాయమైన ప్రగతిశీల బడ్జెట్ కేటాయింపులు జరిగాయని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలు రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో అన్యాయాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కేటాయించిన బడ్జెట్ అన్ని రంగాల వారికి న్యాయమైన విధంగా ఉన్నాయని తెలిపారు. విద్య వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు న్యాయమైన బడ్జెట్ అని తెలిపారు.