వాస్తవ ఘటనలతో ‘జాతర’

'Fair' with real eventsసతీష్‌ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్‌ హీరోయిన్‌. గల్లా మంజునాథ్‌ సమర్పణలో మూవీటెక్‌ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకష్ణ ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రాధాకష్ణారెడ్డి, శివశంకర్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 8న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. హీరో, దర్శకుడు సతీష్‌ బాబు మాట్లాడుతూ, ‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ రాశాను. ఊరి కట్టుబాట్లు, ఆ తంతులు, అందులో జరిగే ఘటనల గురించి చూపించాం. ఈ చిత్రానికి నిర్మాతలు బ్యాక్‌ బోన్‌లా నిలబడ్డారు. నటుడిగా, దర్శకుడిగా ఇది నాకు మొదటి సినిమా. మా చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్‌ చేయండి’ అని అన్నారు. ‘సతీష్‌ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా కూడా బాగా తీశారు. సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని నిర్మాత శివ శంకర్‌ రెడ్డి చెప్పారు. నాయిక దీయా రాజ్‌ మాట్లాడుతూ, ‘నాకు ఇందులో మంచి పాత్ర ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌’ అని తెలిపారు. ఈ వేడుకలో పాల్గొన్న దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, శివబాలాజీ, ధృవవాయు, విశ్వకార్తికేయ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.