పాలిటెక్నిక్‌లో పడిపోతున్న ప్రవేశాలు

పాలిటెక్నిక్‌లో పడిపోతున్న ప్రవేశాలుకొలువులో త్వరగా స్థిరపడాలన్నా, ఇంజనీర్‌గా ఎదగా లన్నా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేసేది పాలి టెక్నిక్‌ విద్య. ఈ కోర్సులో నైపుణ్యం ఉంటే స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు త్వరగా లభించే అవక్షం ఉండడంతో ఆర్థిక స్థోమత లేని తల్లి దండ్రులు తమ పిల్లల్ని ఎక్కువగా ఇందులో చేర్పిస్తున్నారు. ర్యాంకు షర తులు లేకుండా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పిల్లలకు పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కూడా ప్రభుత్వం ఇవ్వడం కూడా మరొక కారణం.అయితే ఇతర రాష్ట్రాలలో ఈ కోర్సుకు గత కొన్ని దశాబ్దాలుగా డిమాండ్‌ కొనసాగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అనుచిత నిర్ణయాలతో దశల వారీగా పడిపోతున్నది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక కోర్సులు ప్రవేశ పెడుతున్నా అవి కొన్ని కళాశాలలకు పరిమితం కావడంతో పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ ఇంజనీరింగ్‌ కోర్సులైన సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ వంటి కోర్సు ల్లో ప్రవేశం పొదవలసి వస్తున్నది. అయితే ఈ కోర్సులలో చేరే విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లి పోయిన నేపధ్యంలో విద్యార్థుల సంఖ్య ఏయేడుకాయేడు పడిపోతున్నది. దీంతో ప్రవేశాలు లేక పోవడంతో పాటు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలు కూడా ప్రభుత్వం నుండి సకాలంలో విడుదల కాకపోవడం మూలాన చాలా పాలిటెక్నిక్‌ కళాశాలలు మూతపడగా కొన్ని పాలిటెక్పిక్‌ కళాశాలలు ఈ కోర్సును రద్దు చేసుకుని బిటెక్‌ వంటి ఇంజనీరింగ్‌ విద్య బోధించడానికి అప్‌ గ్రేడ్‌ అవుతున్నాయి. ఓపెన్‌ బుక్‌ పాలసీ, రెండెళ్లకే ఇంటర్‌ తత్సమాన ధృవీకరణ పత్రం ఇస్తా మంటూ పాలి టెక్నిక్‌ విద్యను బతికించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సత్ఫలితాలు ఇవ్వడంలేదు.
అక్కరలేని బయోమెట్రిక్‌ హాజరు నిబంధన
మూడేళ్ళ పాలిటెక్నిక్‌ విద్యను ఆరు సెమిస్టర్‌లుగా వి భజించారు. పాలిటెక్నిక్‌ కోర్సులో చేరిన వ్యక్తి ఒక్కోక్క సెమి స్టర్‌ దాటుకొని వెళ్ళాలంటే దినదినగండం నూరేళ్లాయు ష్షుగా మారింది. విద్యార్థికి 75 శాతం హాజరు నిర్దేశించిన క్రెడిట్‌లు రాకుంటే ముందు సెమిస్టర్‌లోకి ప్రమోట్‌ చేయ రు. చాలా పాలిటెక్పిక్‌ కళాశాలల్లో అవసరమైనంత ఫ్యాకల్టీ లేదు. స్థోమత ఉన్న వారు ఫ్యాకల్టీ లేని సబ్జెక్ట్‌లను ప్రైవేట్‌ గా నేర్చుకుందామంటే కళాశాలలో బయోమెట్రిక్‌ అటెం డెన్స్‌ సిస్టమ్‌ సహకరించదు. ఎందుకంటే ఒక ముద్రకు మ రొక ముద్రకు మధ్య ఖచ్చితంగా ఆరు గంటల వ్యవధి ఉం డాలి. కొన్ని కళాశాలల్లో నూటా ఇరవై మంది విద్యార్థులకు ఒకటి బయోమెట్రిక్‌ యంత్రం ఉంటుంది. చార్జింగ్‌ ఉంటే ఇంటర్‌ నెట్‌ సిగల్‌ దొరకదు. ఇంటర్‌ నెట్‌ ఉన్నప్పుడు చార్జింగ్‌ అయిపోతుంది. ఇన్ని ఆటంకాలు దాటుకొని పొదు ్దనా, సాయంత్రం ఇన్‌ – అవుట్‌ పడే సరికి రెండు గంటలు వృధాగా గడిచిపోతోంది. ఇలా ప్రతి సెమిస్టర్‌ దాటుకొని ఇంటర్‌ మీడియట్‌ కు, ఇంజనీరింగ్‌, మెడికల్‌ కోర్సుటకు లేని ఈ కఠినమైన నిబంధన ఆన్‌లైన్‌ క్లాసులతో విద్య విధా నం నడుస్తున్న ఈ తరుణంలో కూడా సాధారణ పాలి టెక్నిక్‌ విద్యకు అమలు చేయడంలో ఔచిత్యమేమిటో అర్థం కాదు. మరో కారణం పరీక్షా విధానం. ఒక్క సెమిస్టర్‌ పాస్‌ కావాలంటే కనీసం నలబై పరీక్షలు రాయాలి. ఒక సెమి స్టర్‌కు 90రోజులు పనిదినాలనుకుంటే అందులో 40 రోజు లు పరీక్షలు రాయడానికే సరిపోతాయి. ఇంత కఠినమైన పరీక్షా విధానం అమల్లో ఉండగా అనవసరమైన 75 శా తం హాజరు నిబందన ఎందుకో అర్థం కాదు.
కొరవడిన సమన్వయం-విద్యార్థులకు నష్టం
మరో పక్క తెలంగాణ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యు కేషన్‌కు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ మధ్య సమ న్వయం కొరవడింది. నోటిఫికేషన్‌లన్నీ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్పికల్‌ ఎడ్యుకేషన్‌ జారీ చేస్తున్నా నిర్ణయాలు మాత్రం డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ తీసుకుంటుంది. కళా శాలల మధ్య విద్యార్థుల బదిలీలకు ఈ విద్యా సంవత్స రంలో ఆగస్ట్‌ 2023 వరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యు కేషన్‌ అనుమతినిచ్చింది. దీంతో విద్యర్థులు కళాశాలల్లో చే రడం, హాజరు నమోదు కొరకు బయోమెట్రిక్‌ ఐడి జెనరేట్‌ చేయడం సెప్టెంబర్‌ 2023 వరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రమంతటా భారీ వర్షాలు, వరదల వంటి ప్రకృతి విపత్తులు ఏర్పడడంతో ప్రభుత్వం కార్యా లయాలకు, విద్యా సంస్థ లకు సెలవులు ప్రకటించారు. ఈ నేపద్యంలో కళాశాలలో బదిలీపై చేరే విద్యార్థుల ప్రవేశాల్లో జాప్యం జరిగింది. అయినప్పటికీ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ 75 శాతం హాజరు ఉన్న వారే పరీక్ష ఫీజు చెల్లిం చడానికి అర్హులంటూ పరీక్షల నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నిబంధన కారణంగా పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు ప్రారంభమై పదిరోజులు గడిచిపోయినా కొన్ని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఫీజు చెల్లించడానికి అర్హత పొంలేకపోయాడంటే ఇది ఎంతటి కఠినతరమైన నిబంధ నో స్పష్టంగా అర్థమవుతున్నది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ విద్యా సంవత్సరం ఆఖరి పని దినం నాటికి కూడా హాజరు శాతం తక్కువై సగానికి పైగా విద్యార్థులు ప రీక్ష రాయడానికి అనర్హులు కానున్నారు. హాజరు శాతం త క్కువగా ఉన్న విద్యార్థులను నవంబరు ఒకటి నుండి ప్రా రంభం కానున్న పరీక్షలకు హాజరు కానివ్వమని కొన్ని విద్యా సంస్థలు ఖారాఖండిగా ప్రకటించేశాయి. దీంతో విద్యా ర్థుల్లో ఆందోళన మొదలైంది.
హాజరు శాతం పెంచుకోవడానికి ఇవ్వని అవకాశం
హాజరు శాతం తక్కువైన కారణంగా విద్యార్థులు నష్టపోరాదని గతంలో డైెరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సముచితమైన నిర్ణయాలు తీసుకుంది. వేసవి సెలవుల్లో ప్రత్యేక క్లాసులు తీసుకొని హాజరు శాతం పెంచుకోవడానికి అవకాశాలు కల్సించారు. కరోనా కాలంలో హాజరు శాతం నిబందన పూర్తిగా ఎత్తి వేశారు. ఆ తరువాతి సంవత్సరం లో సాధారణ సెలవు దినాలలో, దసరా సెలవుల్లోనూ బయోమెట్రిక్‌ యంత్రంలో హాజరు శాతం నమోదు చేసు కునే అవకాశం కల్పించారు. దీంతో చాలా మంది విద్యా ర్థులు డిటెన్షన్‌ ప్రమాదం నుండి బయటపడగలిగారు. ఈ దఫా అలాంటి అవకాశాలేవీ కల్పించే దిశగా ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంతో చాలా మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు నష్టపోతున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఒక వేళ అవకాశం ఇచ్చినా 2,4,6,(ఈవెన్‌) సెమిస్టర్లు చదువు తున్న విద్యార్థులకే పరిమితం చేయనుండడంతో 1,3,5 (ఆడ్‌) సెమిస్టర్లు చదువుతున్న వారు పూర్తిగా ఒక విద్యా సంవత్సరం నష్ట పోనున్నారు.
కలవరపడుతున్న విద్యార్థులు
మొత్తం పని దినాలు పూర్తయ్యే నాటికి కూడా హాజరు శాతం సరిపోక వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పు డు ప్రశ్నార్థకంలో పడింది. తదుపరి సెమిస్టర్‌ కు వెళ్ళడా నికి అనర్హులు కాబోతున్నామనే బెంగతో వారంతా కలవర పడుతున్నారు. డిసెంబర్‌ 11,2023 నుండి సెమిస్టర్‌ పరీ క్షలు ప్రారంభం కానున్న నేపధ్యంలో హాజరు శాతం సడ లించే విషయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ వెం టనే సానుకూల నిర్ణయం తీసుకోకుంటే వేలాది మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఇదే జరి గితే రాబోయే విద్యా సంత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో పాలి టెక్నిక్‌ విద్య మనుగడ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు.
– కొయ్యడ కుమారస్వామి, 9441153810