ఫ్రాన్స్‌లో పతనమౌతున్న డీజిల్‌ డిమాండ్‌

Falling diesel demand in Franceఫ్రాన్స్‌: ఫ్రాన్స్‌లో డీజిల్‌ డిమాండ్‌ సంవత్సరం తరువాత సంవత్సరం పతనమౌతోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ లో ఈ పతనం 13 శాతం దాకా వుందని ఇండిస్టీ డాటా ఆధారంగా బ్లూంబర్గ్‌ పేర్కొంది. ఒక దేశంలోని ఆర్థిక కార్యకాలాపాల స్థాయిని ఆ దేశం డీజిల్‌ను వినియోగించే స్థాయిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలోని రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలకు డీజిల్‌ చోదక శక్తిగా ఉంటుంది. ఫ్రెంచ్‌ రవాణా రంగంలో డీజిల్‌ వినియోగం వేగంగా పతనమవటం ఆ దేశంలో పారిశ్రామిక కార్యకలా పాలు, సరుకుల రవాణా మందగిస్తున్నదనటానికి సూచిక గా ఉందని వుడ్‌ మెకంజీ కన్సల్టెన్సీలో రిసెర్చ్‌ ఎనలిస్టుగా పని చేస్తున్న ఎమ్మా హౌషామ్‌ బ్లూమ్‌ బర్గ్‌కి చెప్పింది.
ఫ్రెంచ్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ మధ్యకాలంలో బాగా మందగించింది. మూడవ త్రైమాసికంలో ఫ్రాన్స్‌ వృద్ధి రేటు కేవలం 0.1 శాతమే ఉంది. సెప్టెంబర్‌ దాకా వున్న మూడు నెలల కాలంలో ఉత్పత్తి పెరుగుదల శాతం అంతకు ముందటి త్రైమాసికంలోని 0.5 శాతంతో పోలిస్తే 0.1 శాతమే ఉంది. ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ తాజా డాటాను అనుసరించి ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి కొలబద్దగా భావిం చబడే ఫ్రాన్స్‌ తయారీ, కొనుగోలు మేనేజర్స్‌ సూచిక (పిఎమ్‌ఐ) 2020 మే తరువాత అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. యూరో జోన్‌లో డీజిల్‌ డిమాండ్‌ పతనం ఒక్క ఫ్రాన్స్‌లో మాత్రమే లేదు. జర్మనీ, స్పెయిన్‌, ఇటలీ దేశాల లో కూడా సెప్టెంబర్‌ నెలలో అంతకు ముందటి సంవత్స రం అదే నెలతో పోల్చినప్పుడు డీజిల్‌ అమ్మకాలు క్షీణిం చాయి. ఐరోపాకు చెందిన ఒఇసిడి దేశాలలో డీజిల్‌ డిమాండ్‌ అంతకు ముందటి సంవత్సరం జనవరి, సెప్టెంబర్‌ నెలల మధ్య కాలంతో ఈ సంవత్సరం అదే కాలాన్ని పోల్చినప్పుడు రోజుకు 1,60,000 బ్యారెల్స్‌ తగ్గింది. ఇది 3శాతం క్షీణతకు సమానం. ఈ ప్రాంతంలో డీజిల్‌ డిమాండ్‌ను పరిశీలించే తాజా ఆయిల్‌ మార్కెట్‌ రిపోర్ట్‌ ప్రకారం ఈ ప్రాంతంలో 2023, 2024 సంవత్సరాలలో వర్తమానంలోకంటే అదనంగా డీజిల్‌ వినియోగం రోజుకు 1,50,000 బ్యారెల్స్‌ క్షీణిస్తుంది.