ఎమ్మెల్యే రసమయిపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

– గుండారం సర్పంచ్ వాఖ్యలను ఖండించిన ఎలుక దేవయ్య 
నవతెలంగాణ-బెజ్జంకి: మండల పరిధిలోని గుండారం గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహకారంతో అన్ని విధాలుగా లబ్ధి పొంది తీరా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని మండల బీఆర్ఎస్ నాయకుడు ఎలుక దేవయ్య హెచ్చరించారు. బుధవారం గుండారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలుక దేవయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చి ప్రజల గుండెల్లో ఎమ్మెల్యే రసమయిబాలకిషన్ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడన్నారు. ఎమ్మెల్యే 50 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం, మరో 50 ఎకరాల్లో పౌల్ట్రీ ఫాం నిర్మాణం చేపట్టాడని సర్పంచ్ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని.. సంబంధిత ప్రభుత్వాధికారులతో సర్వే చేపట్టి నిరూపించాలని లేనిపక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎలుక దేవయ్య డిమాండ్ చేశారు.