ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం

– కాంగ్రెస్‌ నాయకులకు గ్రామాల్లో తగిన బుద్ది చెబుతాం
– బీఅర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత బహదూర్‌
నవతెలంగాణ-మంచాల
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని, కాంగ్రెస్‌ నాయకులకు గ్రామాల్లో తగిన బుద్ది చెబుతామని బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత బహదూర్‌ అన్నారు.సోమవారం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 15 ఏండ్లుగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ గొడవలకు లేకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం గడుపుతుంటే, నామినేషన్‌ వేస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ సమయం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటే కనీసం సమయపాలనపై అవగాహన లేకుండా సమయాన్ని వధా చేస్తూ కావాలని బీఆర్‌ఎస్‌ కార్యాలయం ఎదుట సందడి చేస్తు, బీఆర్‌ఎస్‌ జన ప్రభంజనాన్ని చూసి ఓర్వలేక రాళ్ల వర్షం కురిపించి ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి రాళ్ల దాడిని ప్రోత్సహించారనడానికి ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ నాయకులు దాడి చేసి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు.