నవతెలంగాణ-మోర్తాడ్ : గత రెండు రోజులుగా కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గం లో నీ 20 సహకార సంఘాలలో మితిమించిన బాకీలు పేరుకుపోయే అంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని సహకార సంఘం నేతలు ఆరోపించారు. మండల కేంద్రంలోని సహకార సంఘంలో ఏర్పాటు చేసిన విదకర సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ మేరకు బాకీలు ఉన్నాయో తెలుసుకొని ఇప్పటి బాకీలను సరి చేసుకోవాలంటూ ఆరోపించారు 2020 నాటికి సహకార సంఘాలు పూర్తిగా నష్టాలతో ఉండగా ప్రస్తుతం వాటిని చెల్లిస్తూ రైతులకు సేవ చేస్తున్నామని అన్నారు. మార్క్ ఫ్రెండ్ యూరియా కంపెనీల వద్ద ఏ మేరకు డబ్బులు చెల్లించాల్సి ఉందో వాటిని తెలుసుకొని మాట్లాడాలని తప్పుడు ఆరోపణలు సరికాదని అన్నారు. గత ప్రభుత్వాలలో సహకార సంఘాలకు ఏ మేరకు సప్లై చేశారో అదేవిధంగా ప్రస్తుత అధికార ప్రభుత్వం సైతం సహకార సంఘాలకు యూరియా సప్లై చేసే విధంగా సహకరించాలని సహకార సంఘం చైర్మన్ లు డిమాండ్ చేశారు. సహకార సంఘాలు నష్టాలు ఉంటున్నాయి అంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితువు పలికారు.