సోయా పంట కొనుగోళ్లలో తప్పుడు లెక్కలు..

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండల రైతులు పండించిన సోయా పంటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి క్వింటాలుకు 4892 మద్దతు ధర కల్పిస్తూంది. కాని మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మద్నూర్ సింగిల్ విండో ద్వారా జరిపిన కొనుగోళ్లలో అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 కిలోలు ప్రతి సంచికి తూకం చేయవలసి ఉండగా 51 కిలో పైన తూకం చేస్తూ రైతులకు మోసం జరిగిందని 15- 10- 2024 నుండి 7- 1 – 2025 వరకు 2,482 మంది రైతుల నుండి 93,331 సంచులు కొనుగోళ్లు జరిపినట్లు అధికారుల అంచనాలు చూపిస్తున్నాయని 151 లారీలలో వివిధ గోదాములకు సోయా పంటను తరలించినట్లు కంప్యూటర్లు పొందుపరచడం జరిగిందని ఫిర్యాదుదారుడు తహసిల్దారుకు అందజేసిన ఫిర్యాదులు పేర్కొన్నారు. కంప్యూటర్లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 2482 మంది రైతుల నుండి కొనుగోలు చేసిన సోయా పంట 94,232 సంచులు కానీ అధికారులు వాట్సాప్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం 93, 331 సంచులు చూపిస్తున్నాయి. అధికారుల లెక్కల్లో 901  సంచుల తేడా కనిపిస్తుంది ఇది ఇలా ఉండగా 1,1,2025  నుండి7,1,2025 వరకు 533 మంది రైతుల వద్ద 21580 సంచులు కొనుగోలు చేసినట్లు ఈ తేదీలలో కొనుగోలు జరిగిన సోయా పంటను 17 లారీలలో 11228 సంచులు మరో 19 లారీలలో 11773 సంచులు ఇక్కడి నుండి గోదాములకు తరలించారని ఇలాంటి లెక్కలతో అధికారులు కంప్యూటర్లు నమోదు చేసిన వాటిలో భారీగా అక్రమాలు కనిపిస్తున్నట్లు మద్నూర్ మార్కెట్ కమిటీ హమాలీలు ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. కానీ సోయా పంట మద్దతు ధర కొనుగోళ్లలో అమాలీలు అధికారులు సెలవు దినాల్లో కూడా ఆదివారాల్లో భారీ మొత్తంలో తూకాలు జరిగినట్లు సెలవు రోజుల్లో జరిగిన కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. అక్టోబర్ 15 2004 నుండి కొనుగోలు ప్రారంభమైన తరువాత ముగింపు 7,1, 2025 వరకు ఆరు ఆదివారాలలో నిబంధనలకు విరుద్ధంగా తూకాలు జరిగినట్లు మాజీ ఎంపీటీసీ సభ్యులు కర్రే వార్ రాములు తహసిల్దార్ కు అందజేసిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలపై సమగ్రమైన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన తహసిల్దార్ కు విజ్ఞప్తి చేశారు మద్దతు ధర సోయా పంట కొనుగోళ్లలో జరిగిన అవకతవకల పైన మాజీ ఎంపీటీసీ అందజేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ కు జిల్లా డిఎంకు, జిల్లా కోఆపరేటివ్, అధికారులకు నివేదికలు అందజేస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.