నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో జనవరి 21న నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై అసత్య ప్రచారం చేసిన ఎలాక్ట్రానిక్ మీడియా యాజమాన్యంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు చేపట్టాలని బుధవారం పోలీస్ స్టేషన్ యందు ఎస్ఐ క్రిష్ణారెడ్డికి పిర్యాదు చేసినట్టు మండల యువజన కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. శానగొండ శరత్,జేరిపోతుల మధు తదితరులు పిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.