– ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. కొంత మంది వ్యక్తులు, సంస్థలు పనిగట్టుకుని సర్కార్‌ను ఆబాసుపాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. జులై 2023లో డైట్ ఛార్జీలు పెంచుతున్నట్టు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.పత్రికలకు ప్రకటన జారీ చేశారనీ, ఆ తర్వాత నాలుగు నెలలు అధికారంలో ఉన్నప్పటికీ.. ఛార్జీలు పెంచకుండా మోసం చేశారని తెలిపింది. 2017లో ఉన్న డైట్, కాస్మొటిక్ ఛార్జీలతో ఇబ్బంది పడ్డ గురుకులాలు, హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం 40 శాతం పెంచినట్టు వివరించింది. ఫలింతంగా రాష్ట్రంలోని.50 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుందని పేర్కొంది.