మిథ్యా కిరీటం

False crownకొండను తొవ్వి ఎలక పట్టినట్టు

విద్వేషాన్ని
పరిపూర్ణ వ్యతిరేకతనీ
కలగలిపి
నూరి
శోధించి సాధించి
కాయో పండో
పండో కాయో తెలియని

పండుకాయ
కాయపండు
పార్లమెంటుకు తెచ్చారు

మిథ్యాకిరీటం పెట్టి
ఆమెకు
ఓట్లమాయవల
వేద్దామనే-

యాభయారించుల గాలి
ఎగబీల్చి
చూపుదట్టించి
కరిమింగి
విసరించిన
వెలగపండు నవిష్కరించారు

మూటల కొద్ది మాటలమండె కట్టి
కడవల కొద్ది
ఆనంద కన్నీళ్ళు చల్లారు

కర్రసాములు కత్తిసాములు
నత్యాలు పురస్కారనటనలు
భారీగా
మోహరించారు

ఎప్పుడో తెలియని
పెండ్లికి
ఇప్పటినుంచే
బాజా భజంత్రీలు మొదలు పెట్టారు

కూర్చోబెట్టి
ముందు
కోట శ్రీనివాస్రావులా
కోన్ని వేలాడదీశారు

కడుపునిండా తినండని !
ఖాళీ
విస్తర్లు వేశారు

– వడ్డెబోయిన శ్రీనివాస్‌