దళిత బంధుపై అసత్య ప్రచారాలు మానుకోవాలి

నవతెలంగాణ-వీణవంక
దళిత బంధుపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని దళిత సంఘాల నాయకులు, మాజీ ఎంపీటీసీ తాండ్ర శంకర్ కోరారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటే ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పర్లపల్లి తిరుపతి, దాసారపు శ్యాం, కండె మహేందర్, పులి ప్రకాష్, అందు కుమార్, జలపతి, నర్సయ్య, పర్లపల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.