నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మొయినాబాద్ ప్రాంతంలోని ప్రత్యేక పాఠశాలగా ప్రారంభమైన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కోడింగ్ పాఠశాలని మూసేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పాఠశాలని శంకర్‌పల్లి బాలికల గురుకుల పాఠశాలకు అనుసంధానంగా మార్చినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన కోడింగ్ నైపుణ్యాన్ని నేర్పించేందుకు నిర్మాణాత్మక చర్యల్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు.