తప్పుడు వెరిఫికేషన్..ఒక్క పోస్టుపై ఇద్దరికీ పోస్టింగు

నవతెలంగాణ – ఆర్మూర్
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు బదిలీలు వెబ్ ఆప్షన్ల ద్వారా నిర్వహించడం జరిగింది అని జిల్లాలో ఒక్క పోస్టుపై ఇద్దరికీ పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని డి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ఇన్చార్జ్ శాంతాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో బయోలాజికల్ సైన్స్ (లోకల్ బాడీ ) తె.మీ సబ్జెక్టులో మొదటగా సూచిక 1 ప్రకారం కె. పద్మజ అనే ఉపాధ్యాయురాలు జెడ్పిహెచ్ఎస్ సారంగపూర్ లో గత నెల 18 న విడుదల అయి, ఆమెకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అలాట్ అయిన జెడ్పిఎస్ఎస్ కొండూరు. (సిరికొండ మండలం) 19వ తేదీ హెడ్ మాస్టర్ కు రిపోర్ట్ చేసి జాయిన్ కావడం జరిగింది అని తెలిపారు. ఇది ఇలా ఉండగా. రెండు రోజులు అనంతరం సూచిక,2 ప్రకారం టి. శైలజ అనే ఉపాధ్యాయురాలు జాయిన్ అయిన వేరే జడ్పిహెచ్ఎస్ పాఠశాల (ధర్పల్లి)నుoడి విడుదల కాకుండానే k.పద్మజ పనిచేస్తున్న జెడ్పీఎస్ఎస్ కొండూరు పాఠశాలలో 21. తేదీన న హెడ్ మాస్టర్ ఆమెను జాయిన్ చేసుకోవడం, ఆమె చేత 19,20 (జూన్) రెండు తేదీలలో కూడా సంతకం పెట్టించడం జరిగింది అని తెలిపారు.
కే.పద్మజ జెడ్ పి ఎస్ ఎస్ కొండూరు పాఠశాలకు వెళ్లాలని, రాత పూర్వక ఉత్తర్వులు విడుదల చేసేది లేదని ఇది డిఈఓ గారి మౌఖిక ఆదేశాలు అని చెప్పుతూ 21 తేదీ నుండి నేటి వరకు ఆమె చేత. హాజరు రిజిస్టర్ లో సంతకాలు పెట్టించకుండా వేధించడం జరుగుతున్నది అని అన్నారు. తప్పుడు వెరిఫికేషన్ వల్ల ఒక్క పోస్టులో ఇద్దరు పని చేసే పరిస్థితి తలెత్తింది వెబ్ ఆప్షన్ లో ఏదైనా ఒక పాఠశాల అలాట్ అవుతది, కానీ రెండు వేరువేరు పాఠశాలలో ఒకరికి ఎలా అలాట్ జరిగింది. అంటే మాడిఫికేషన్లు జరిగినాయినడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. మూడుసార్లు తన సమస్యను న్యాయంగా పరిష్కరించాలని ఇచ్చిన విజ్ఞప్తులపై స్పందన కరువైంది. ప్రస్తుతం. సొంతంగా ఒక హాజరు రిజిస్టర్ ను తయారు చేసుకొని పాఠశాలకు హాజరైన రోజులలో సంతకాలు చేసుకోవడం జరుగుతుంది అని అన్నారు. ఇప్పటికైనా స్పందించి . నిబంధనల మేరకు న్యాయం చేయాలని, గెజిటెడ్ హెడ్మాస్టర్ నిబంధనలు పాటించకపోవడం, అధికార దుర్వినియోగం కారణంగా గత 15 రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి తోడు మీరు సమస్యను పరిష్కరించకుండా పదే పదే తమ కార్యాలయానికి పిలిపిస్తూ అనధికార వ్యక్తులతో సలహాలు ఇప్పిస్తూ, ఒత్తిడి చేయడం అభ్యంతరకరం. ఈ పరిణామాల వల్ల తీవ్రమైన ఆందోళనతో ఆమెకు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తిన, జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగిన, అందుకు పూర్తి బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారి బాధ్యత వహించవలసి ఉంటుందని ఇట్టి విషయాన్ని తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ కు, జిల్లా కలెక్టర్కు సైతం వివరించినట్టు తెలిపారు.