కమ్యూనిస్టులపై తప్పుడు రాతలు సరికాదు

False writings on communists are not correct– సిమెంట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిబద్ధతతో పోరాడుతున్నది మేమే..
– సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక ప్రతుల దహనం
నవతెలంగాణ-రామన్నపేట
ఏమాత్రం పరిశీలన చేయకుండా ఊహాజనితంగా ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కమ్యూనిస్టులపై తప్పుడు రాతలు రాయడం సరికాదని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జల్లల పెంటయ్య, సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రం లోని సుభాష్‌ సెంటర్‌లో సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ప్రతలును దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామన్నపేటలో ఆదానీ అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో నికరంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులేనని చెప్పారు. లెఫ్ట్‌ పార్టీలు పోరాటం చేయటం లేదని, వారి కార్యాచరణలో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ ఊసే లేదంటూ.. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నమస్తే తెలంగాణ పత్రిక లో వార్త ప్రచురించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, సీపీఐ నాయకులు ఊట్కూరి కృష్ణ, సీపీఐ(ఎం) నాయకులు కందుల హనుమంతు, కల్లూరి నగేష్‌, బావాండ్లపల్లి బాలరాజు, ఊట్కూరి భాగవంతం, నాగటి ఉపేందర్‌, గొరిగే సోములు, మునికుంట్ల లెనిన్‌, శానాగొండ వెంకటేశ్వర్లు, బావాండ్లపల్లి సత్యం, పులి బిక్షం, పండగ రాజమల్లు, గుండాల బిక్షం, శానాగొండ రాము, దేవయ్య పాల్గొన్నారు.