శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ పేస్ట్ కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా గురువారం  ఫ్యామిలీ ఫెస్ట్ నిర్వహించారు. ఈ ఫ్యామిలీ ఫెస్ట్ లో విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క ఔనత్యాన్ని తెలియజేయడానికి శ్రీ చైతన్య యాజమాన్యం తల్లిదండ్రులకు పాదపూజ చేసి వ్వారి పాదాలకు నమస్కరించి తల్లిదండ్రుల దీవెనలు తీసుకునే బృహత్తరమైన కార్యక్రమం జరిగిందని, ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ముత్తు పేర్కొన్నారు. వారు ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఋణం ఎన్ని జన్మలెత్తిన తీసుకోలేనిది అని మనం చేసే ప్రతి మంచి పనికి ముందు తల్లిద్రండ్రుల ఆశీర్వచనాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6వ తరగతి నుండి 10వ తరగతి విధ్యార్ధుల మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రైమరీ కో ఆర్డినేటర్ ప్రసన్న, ప్రీ ప్రైమరీ కో ఆర్డినేటర్ శ్రీ విద్య, డీన్ సంతోష్,సి ఇంఛార్జి రాకేష్, ప్రీ ప్రైమరీ ఇంఛార్జి లిఖిత ,అధ్యాపక బృందం పాల్గొన్నారు.