– ఒక్క కుక్క కు.ని కి 1600లు
– కౌన్సిల్ తీర్మానం కు ఎజెండాలో పొందుపరిచిన అంశం
– నేడు సిరిసిల్ల మున్సిపల్ లో సాధారణ సమావేశం
నవతెలంగాణ – సిరిసిల్ల
ఇక అన్ని అయిపోయాయి కుక్కల పేరిట లక్షలు దండుకోవడానికి సిద్ధమయ్యారు మనుషులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సిరిసిల్లలో మాత్రం పురపాలక సంఘం కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విషయం బయటకు తెలిస్తే నవ్వకుండా ఉండేవారు ఉండాలని చెప్పవచ్చు రోడ్లు మురుగు కాలువల కు నిధులు చెల్లించాలని తీర్మానాలు మున్సిపల్ లో చేసేవారు పాలకవర్గం గడువు ముగుస్తున్న కొద్ది ఆఖరకు కుక్కల పేరిట నిధులు వెచ్చిస్తున్నారు.
కుక్కకు కు.ని ఆపరేషన్… కుక్కకు 1600 లట
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడానికి నిర్ణయం తీసుకుంది కానీ ఒక్కో కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడంతోపాటు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించడానికి 1600లు ఖర్చు అవుతాయని ఏకంగా మున్సిపల్ ఎజెండాలోనే పెట్టారు ఒక్కో కుక్కకు 1600 పెట్టి ఆపరేషన్ చేయించడానికి హైదరాబాదుకు చెందిన ఓ సొసైటీకి అప్పగించినట్లు నివేదికలో పొందుపరిచారు. పట్టణంలో కుక్కల బెడద అధికంగా ఉందని అత్యవసర దృష్ట్యా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఈ ప్రాణహాని ఉండడంతో వెంటనే పట్టణంలో కుక్కల ను రగుడులోని జంతు సంరక్షణశాలకు తరలించాలని మున్సిపల్ అధికారులు పాలకవర్గం ఆదేశించింది. అంతేకాకుండా జూలై 2023 వరకు 694 కుక్కలను పట్టి చికిత్స చేయించామని ఏజెండాలో పేర్కొన్నారు. 273 కుక్కలకు మాత్రమే అత్యవసర దృష్ట్యా 4.36 లక్షలు ఏజెన్సీకి చెల్లించడం జరిగిందని మిగతా 421 కుక్కలకు సంబంధించి 6.94 లక్షలు ఏజెన్సీకి చెల్లించవలసి ఉందని ఎజెండాలో పొందుపరిచారు. పెండింగ్ లో ఉన్న 6.94 లక్షలు జనరల్ ఫండ్ నుంచి చెల్లించడానికి తీర్మానం చేయాలని అలాగే వెయ్యి కుక్కలను పట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి 16 లక్షలు చెల్లించే విధంగా తీర్మానం చేయాలని పొందుపరిచారు. అంటే కుక్కల పేరిట మొత్తం 27.30 లక్షలు రెండు సంవత్సరాల్లో ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తుంది జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి మున్సిపల్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.