హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమా వచ్చే శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్టు మేకర్స్ తెలిపారు. టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్‌తో ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇది టికెట్ బుకింగ్స్‌లోనూ క్లియర్‌గా కనిపిస్తోందని, థియేటర్స్, మల్టీప్లెక్స్‌లో టికెట్స్ బుకింగ్స్ చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయని, హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఫ్యామిలీస్‌తో కలిసి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.