హర్యానాలో బుసకొట్టిన మతోన్మాదం

Fanaticism in Haryanaమతసామరస్యం, లౌకికతత్వం కాపాడుకోవాలని చాలాకాలంగా ప్రజాస్వామికవాదులు చెబుతున్న మాట ఎంత నిజమో ఆచరణలో అర్థమవుతున్న సందర్భమిది. దేశ పాలకులు ఆ విధమైన సందేశంతో ముందుకు రావడం లేదు సరికదా ఎగదోసేందుకు కారణమవుతున్నారు.గత మూడు మాసాలుగా దేశం మణిపూర్‌లో హింసాకాండపై కలత చెందుతున్నది. ఈశాన్యాన కొండకోనల్లో మారుమూలల్లో మహిళలపై ఘోరకలి సాగిన తీరు తెలుసుకుని భరతమాత తల్లడిల్లింది. అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించింది. దేశం సిగ్గుపడాలని ప్రధాని మోడీ పార్లమెంటు భవనం ముందు ప్రవచించారు కూడా. అయితే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటులో అదే మాట చెప్పడానికి ఒప్పుకోలేదు. ఉభయ సభల్లో ఆ అంశం సమగ్రంగా చర్చించడానికి కేంద్రం సిద్ధపడలేదు. అవిశ్వాస తీర్మానం రూపంలో చర్చ చేద్దామని ప్రతిపక్షాలు కొత్తవ్యూహం చేపట్టాల్సి వచ్చింది. ఈలోగా దేశ రాజధాని శివార్లలోని కార్పొరేట్‌ హబ్‌ గుర్‌గ్రాం, నూహ పట్టణాల్లో మత కలహాలు భగ్గుమన్నాయి. మత సంస్థలు వ్యూహాత్మకంగా పెట్టిన చిచ్చు ఆరుప్రాణాలు పోవడానికి కారణమైంది. హిందూత్వ శక్తుల కవ్వింపు చర్యలు, వాటిపై అభద్రతతో ముస్లింలు రెచ్చిపోవడం తీవ్ర హింసాకాండకు దారి తీసింది. అక్కడ చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు, పనిచేసుకుని పొట్ట పోసుకునే శ్రమజీవులు వలస ప్రాణులు అకారణంగా బలైపోయారు. మణిపూర్‌ మంటలు ఢిల్లీపాలకులను చేరడానికి చాలా సమయం పట్టింది కానీ ఈ విధ్వంసం దావానంలా వ్యాపించిన హింస దేశానికే కలవరం కలిగించాయి.
ఈ సమయంలోనే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వాజ్యం తిరగదోడబడింది. ఒకప్పుడు అయోధ్యలో బాబ్రీమసీదు/రామజన్మభóూమి వివాదం రగిలిన తీరులోనే ఇప్పుడు వారణాసి వివాదం రగులుకుంటుందనే సందేహాలు బలపడుతున్నాయి.ఈ మసీదులో పురావస్తు పరిశోధనలు జరపాలంటూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలుౖ సుప్రీం కోర్టు దాకా వెళ్లి తిరిగి హైకోర్టుకు వచ్చి అనుమతి పొందాయి. అయితే ఆ అనుమతితో నిమిత్తం లేకుండా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాన్ని మసీదు అననక్కరలేదని ఏకపక్షంగా ప్రకటించేశారు. ఇలాంటి వైఖరి ఆచరణలో మతోన్మాద రాజకీయాలను ఎలా ప్రకోపింపచేస్తుందో చాలాసార్లు చూశాం. అన్నట్టు మధురలోనూ కృష ్ణజన్మస్థాన్‌ ఇలాంటి మలుపులే తిరుగుతున్నది. వందల సంవత్సరాల కిందటి చరిత్ర పరిణామాలపౖౖె ఇలాటి వివాదాలు పునరావృతం కాకూడదనే పార్లమెంటు 1991 ప్రార్థనా స్థలాల చట్టం ఆమోదిం చింది. అయోధ్య సమస్యలో సుప్రీం కోర్టు తీర్పును పాటించాలని మిగిలిన అన్ని చోట్ల 1947 ఆగష్టు15న స్వాతంత్రం వచ్చిన నాటి యథతథ స్థితి కొనసాగాలి తప్ప కొత్త వివాదాలు అనుమతించరాదని ఈ చట్టం నిర్దేశించింది. కాని స్వయాన సుప్రీం కోర్టు ఇప్పుడా చట్టానికి కొత్త భాష్యం చెప్పి కొత్త తగాదాలకు తలుపుతీసింది. ఈ వివాదాలు, విధ్వంసాలు వి ద్వేషాల పర్యవసానాల పట్ల ప్రతిభారతీయుడూ అప్రమత్తంగా వుండాలి. జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక ఆర్‌పిఎఫ్‌ జవాన్‌ నలుగురు ముస్లింలను వెతికి మరీ కాల్చి చంపడం అతన్ని మతిస్తిమితం లేనివాడని అధికారులు సమర్థించడం కూడా ఇలాటిదే.
హర్యానాలో జరిగిందేమిటి?
హర్యానాలో చెలరేగిన మత ఘర్షణలు, విధ్వంస విద్వేషాలు వాస్తవానికి ఢిల్లీలో జరిగినట్టే భావించాలి. ఎందుకంటే గురుగ్రామ్‌ పారి శ్రామిక కేంద్రం దేశ, విదేశీ పెటు ్టబడులకు పెద్ద సంస్థలకు నిలయం. దేశమంతటి నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల నుంచి సామాన్యుల వరకూ అక్కడుంటారు. ఇటీవలే కురిసిన కుంభవృష్టి వరదల సమయంలో ఈ సంపన్నులు తప్పించు కోగలిగారు గాని మతకలహాల దెబ్బకు తట్టుకోలేకపోయారు. పని చేసుకోవడానికి వలస వచ్చిన అనేక మంది ఇంటిదారి పట్టారు. చిన్నచిన్న వ్యాపారులు దారు ణంగా నష్టపోయారు. వారి దుకా ణాలు, హోటళు, ఇండ్లు ధ్వంసం కావడం , పూర్తిగా ధగ్ధమై పోవడం వారిని కుది పేసింది. డబుల్‌ ఇంజన్‌ సర్కార్ల బీజేపీ నేతల నుంచి ఒక్క ఓదార్పుమాటైనా రాకపోగా ఎదురు దాడి చేస్తుండడంతో హతాశులై వారు మరెక్కడికి పోవాలని కలవరపడు తున్నారు. మొత్తం వ్యవహారం చూస్తే ఒక పథకం ప్రకారమే అల్లర్లు సృష్టించినట్టు స్పష్టమవుతున్నది. వాస్తవానికి నూV్‌ా ముస్లిం జనాభా అధికంగా వుండే ప్రాంతం.జులై 31న విశ్వ హిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ఇతర పరివార్‌ సంస్థలు రెండు దేవాలయాల మధ్య బ్రిజ్‌ మండల్‌ యాత్ర ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. సంప్రదాయకంగా ఎప్పటినుంచో జరుగుతున్న ఈ ప్రదర్శన ఇటీవలి సంవత్సరాలలో ఉద్రిక్తతలకు ఆలవాల మవుతున్నది. ఎందుకంటే వీహెచ్‌పీ స్థానికులతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసి బలప్రదర్శనగా మార్చేసింది. పైగా ఈ సారి యాత్రలో భజరంగదళ్‌ నాయకుడైన మోనూ మనేసర్‌ పాల్గొం టాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ మనేసర్‌ భివానీ జిల్లా భరత్‌పూర్‌లో మొన్న ఫిబ్రవరిలో గోరక్షణ పేరిట నిస్సార్‌, జునాయిడ్‌ అనే ఇద్దరు ముస్లిం యువకుల హత్యకేసులో నిందితుడుగా వున్న వ్యక్తి. దానికి ముందు జిమ్‌లో శిక్షణ నిచ్చే ఆసిఫ్‌ఖాన్‌, వారిస్‌ ఖాన్‌ అనే మెకానిక్‌ హత్యలో కూడా నిందితుడుగా వున్నాడు. అలాంటి వ్యక్తి పాల్గొంటాడని ప్రకటించడం ముస్లిం యువతలో తీవ్ర నిరసనకు దారితీసింది. వారూ వ్యతిరేకంగా సమీకృతం కావడం ప్రచారం సాగించడానికి దారితీసింది. ముందునుంచి సోషల్‌ మీడియాలో ఈ కథనాలు పోటాపోటీగా నడిచాయి. ఈ సారి ప్రదర్శన తీవ్ర హింసాకాండకు దారితీయవచ్చు నని ముందునుంచే పరిశీలకులు అనుమానిస్తూ వచ్చారు. రాజకీయ పార్టీల నాయకులు ఆ మేరకు పోలీసుల యంత్రాంగానికి హెచ్చరికలు చేశారు కూడా. అయితేనేం దేశంలో ఇప్పుడున్న వాతావరణం బీజేపీ- ఆరెస్సెస్‌ రాజకీయ వ్యూహాల కారణంగా వాటిని బేఖాతరు చేశారు. మరీ ముఖ్యంగా చివరి రోజున మరో భజరంగ్‌దళ్‌ కార్యకర్త రెచ్చగొట్టే భాషలో దారుణమైన విడియో విడుదల వైరల్‌ చేశాడు. ‘నూహ ప్రజానీకం మా రాకను కాచుకోవడానికి సిద్ధంగా వుండాలని’ సవాళ్లు విసిరాడు.
హత్యలు విధ్వంసాలు,అరాచకం
ఈ నేపథ్యంలో మొదలైన ప్రదర్శనలో పరివార్‌ కార్యకర్తలు తీవ్రభాషలో రెచ్చగొట్టడం ఆశ్చర్యమేమీ కాదు.మానేసర్‌ రాలేదు గాని భజరంగదళ్‌ నాయకుడైన సుందర్‌జైన్‌ హాజరయ్యారు. నల్వార్‌ మహదేవమందిర్‌లో పాల్గొని ఉద్రేకాలు పెంచేలా ప్రసంగించాడు. అంతేగాక వారు తుపాకులు ,ఇతర ఆయుధాలు పట్టుకుని ఉద్రిక్తత పెంచారు. ముందే రెచ్చిపోయి వున్న ముస్లిం యువత వారిపై రాళ్లు విసిరారు.దాంతో ప్రదర్శకులు తాము బయిలుదేరిన మొదటి గుడి దగ్గరకు వచ్చి దాచుకున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వాధినేతలు పరిస్థితిని ఉపశమింపచేయడానికి చర్యలు తీసుకోలేదు. పక్క జిల్లాల నుంచి అదనపు పోలీసులను రప్పించి వారి రక్షణలో మళ్లీ ప్రదర్శకులను ముందుకు సాగేందుకు అనుమతినిచ్చారు. ఆగష్టు 2న ఈ ప్రదర్శకులు వెళ్లి సెక్టార్‌ 57లో ఒక మసీదుపై దాడిచేశారు. అక్కడ పాతికేళ్ల వయసున్న ఇమామ్‌ను చంపివేసినట్టు సమాచారం. మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు దాంతోపాటు మరో మసీదుపై పెట్రోలు బాంబులు విసి రశారు. దాంతో అవతలివారు మళ్లీ ఎదురుదాడి చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది. కర్ఫ్యూతో సహా నిషేదాజ్ఞలు విధించాల్సి వచ్చింది. వాహనాల దహనం, విధ్వంసం అల్లర్లు అరాచకం తాండవించాయి. ఇక జిల్లా యంత్రాంగమైతే అచేతనంగా వుండిపోయింది. నూహ సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్‌పై దుండగులు దాడిచేశారు. ఇద్దరు హోంగార్డులు, నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గుర్‌గ్రాం, నూV్‌ా, సోహ్నాలలో 70 మందికి పైగా గాయాల పాలయ్యారు. కోటానుకోట్ల రూపాయల విలువైన ఆస్తి సర్వనాశనమైంది. వందలాది మంది ప్రాణాలు అరచేత పట్టుకుని ఇండ్లు వదలి పోయారు. ఐటి నిపుణులు కూడా హడలెత్తి స్వస్థలాలకు పయనం కట్టారు. ఒక్కసారిగా గుర్‌గ్రామ్‌ కల్లోలితమై పోయింది. ఇక్కడున్న బహుళజాతి కంపెనీల ప్రతి నిధులు విదేశాల నుంచి ఆందోళన సందేశాలు పంపే పరిస్థితి ఏర్పడింది.ఈ స్థాయిలో విధ్వంసం జరిగిందటే దీని వెనక పథకం ప్రకారం జరిగిన కుట్ర వుందని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టార్‌ ప్రకటించారు. అదెవరన్నదే ప్రశ్న. నిజానికి ఇలాంటిది జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నా అలసత్వంతో అందుకు అవకాశమిచ్చిన ఆయన ప్రభుత్వ పాత్ర ఏమిటి? పైగా నిజానికి ప్రభుత్వ వివరణలు ఎక్కువగా హిందూత్వ శక్తులను సంతృప్తిపర్చేందుకు తప్ప బాధిత ముస్లింలకు ఓదార్పుగా లేవు. అల్లర్లు మొదలైనాక కూడా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా తమ అనుమతి లేకుండా ప్రదర్శనలు జరిగినట్టు చెప్పుకొచ్చారు. బీజేపీ ఎంపి రావ్‌ ఇందర్‌సింగ్‌ మాత్రం ఇటువైపు నుంచికూడా రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని కొంత వరకూ అంగీకరించారు. మొత్తంపైన పోలీసులు రంగం లోకి దిగి 140 మందిని అరెస్టు చేశారు. వందవరకూ ఎప్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
సోషల్‌ మీడియా ఆయుధంగా..
నూహ హింసాకాండలో ఆందోళనక లిగించే అంశం సోషల్‌ మీడియా పాత్రే. దాదాపు 2000 వీడియోలు యూ ట్యూబ్‌ ద్వారా ప్రసారమై ప్రజలలో భయోత్పాతం మత విద్వేషం పెంచాయి. ఇరుమతాల వైపు నుంచి వున్నా అధిక భాగం విద్వేషాన్పి పెంచే విధంగా భజరంగదళ్‌ సృష్టించినవే. అవతలివారు దాడి చేసినట్టు అమానుషంగా ప్రాణాలు తీసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.నూహ జిల్లా పాతపేరు మేవట్‌. మేవా రూపురేఖలు మార్చేయాలి. ఇది హిందూ హంతకుల కేంద్రంగా వుండొద్దని రెచ్చగొట్టారు. ఇందుకు ప్రతిగా ముస్లిం యువకులు కొందరు కూడా హింసకు పురికొల్పే విడియోలు పోస్టు చేశారు. ఇదంతా వాతా వరణాన్ని కలుషితం చేస్తున్నా సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నా అధికార వర్గాలు ప్రేక్షక పాత్ర పోషించాయి జరగాల్సిన ఘోరాలు జరిగిపోయాక ఇప్పుడు సోషల్‌ మీడియా విడియోలు పరిశీలించేందుకు కమిటీని నియమించారు. వారిలో కొందరిపై కేసులు కూడా పెట్టారు. మరికొందరిపై దర్యాప్తు జరుగుతున్నది. చిన్నాభిన్నమైన అక్కడ ప్రజాజీవితం కోలుకోవడానికి చాలాసమయమే పడుతుండనడంలో సందేహం లేదు. ఎన్నికల కోసం మత విభజన పెంచే రాజకీయాలు మరోసారి ఉధృతమయ్యే ప్రమాదాన్ని ఈ ఘటనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.

తెలకపల్లి రవి

Spread the love
Latest updates news (2024-08-19 10:54):

normal range of blood sugar level GN7 during pregnancy | will HrN blood sugar being too high cause heart attack | 480 blood sugar Ws4 level | U1N can high blood sugar levels cause heart disease | what is a normal blood 1RN sugar range for dogs | long term side effects of high PKy blood sugar | effect of blood aS1 pressure medication on blood sugar | how long does sugar remain in your kb8 blood | to reduce blood sugar level 0dn | how often to monitor blood pAW sugar with very sick patient | can inulin raise blood sugar L1q | 107 blood sugar level after pRT eating | artificial sugar cause blood sugar CNG | GOF us diabetic blood sugar | why is my blood sugar high after FPa exercise gestational diabetes | blood sugar high NKd what does it mean | teeth grinding BRU and blood sugar levels | low blood sugar symptoms diabetes nNC type 2 | my fasting blood sugar is 7MO 185 | is coconut oil rsk good for blood sugar control | does hyperthermia in newborn ntU affect blood sugar | blood jVk sugar 40 minutes after eating | does L4N drinking straight gin raise your blood sugar | does reduction of YpE bmi help with blood sugar | blood Sj1 sugar reading at 304 | can spikes 1nJ in blood sugar cause edema | 8rs rice raise blood sugar | oatmeal lower blood sugar bOb | xuT can eating make blood sugar go down | best alcohol for high blood sugar AKd | type 2 diabetes high blood sugar when not eating oyP carbs | cd3 blood sugar sex magik lyrics meaning | Om4 can severe pain cause high blood sugar | XNf artificial pancreas and low blood sugar | blood sugar variation online shop | zdN diabetes affects blood sugar | can vitamins cause blood sugar to rise Oxw | blood sugar fasting 459 mg SUM dl | foods 0f2 that moderate blood sugar | regulating blood sugar negative feedback PC2 | red 1XH hot chili peppers blood sugar sex magik poster | aop blood sugar level after 7 hours of eating | what foods raise blood WB0 sugar levels quickly | does fish oil help lower blood sugar Yny | testing 2Cr blood sugar 1 hour after eating | normal 5eG value of blood sugar random | popcorn increase sGH blood sugar | can heat make blood sugar tOT drop | lXh how to get your blood sugar down fast naturally | is T5M 75 a low blood sugar level