మహాత్మున్ని బలి తీసుకున్న మతోన్మాదులు

Fanatics who sacrificed Mahatmaభారత స్వాతంత్య్రోద్యమంలోకి జన బాహుళ్యాన్ని సమీ కరించిన నాయకుడు మహాత్మా గాంధీ. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీజీ అనుభవంతో, స్వదేశా నికి చేరి స్వాతంత్య్ర పోరాటంలో భాగమయ్యారు. క్రమంగా కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడై వివిధ తరగతుల ప్రజలను పోరాటంలోకి సమీకరించారు. తిలక్‌ మరణం తర్వాత ఆ స్థానం స్వీకరించిన గాంధీజీ పోరాటంలో నూతన ఒరవడులు సృష్టించారు. గాంధీజీ 1869లో అక్టోబర్‌ 2న గుజరాత్‌లోని పోరు బందర్‌లో పుట్టారు. తండ్రి దివాన్‌ కరంచంద్‌. 1891లో గాంధీజీ లండన్‌లో బారిష్టర్‌ పట్టా తీసు కొన్నాడు. తాను సనాతనుడిని అని చెప్పకొంటూనే కులం కట్టుబాట్లను కాదని దళితులను సమీకరిం చడం వారి చేత దేవాలయాల ప్రవేశం చేయించడం, ముస్లింలు కూడా భారతీయులేనని, హిందువు లతో సమానమని చెప్పడం, దేశ విభజన తర్వాత చెలరేగిన మత కల్లోలాలను అరికట్టడానికి 75 ఏండ్ల వయస్సులో కూడా నిరా హార దీక్షలు చేసి పరిస్థితిని అదుపులోకి తేవడం నచ్చని మతో న్మాదులు మహాత్ముడిపై అతి దగ్గరి నుండి పిస్టల్‌తో కాల్చి హత్య చేశారు. ఆ పని చేసింది నాథురాం గాడ్సె అయినా ఆ కుట్రలో ఒక బృందమే ఉంది. ఆ కుట్రలో ప్రధాన పాత్రదారులైన గాడ్సె, ఆప్టేలకు ఉరిశిక్ష పడగా మిగతా వారికి జైలు శిక్షలు పడ్డాయి. కాని తెరవెనుక ఉండి వారికి సహకరించిన, ప్రోత్సహించిన వారు మాత్రం గాడ్సె, ఆప్టేల మౌనం వల్ల, సమగ్ర దర్యాప్తు జరగనందున శిక్షల నుండి తప్పించుకొన్నారు.
గాంధీజీ హత్య కేసులో ఒక ముద్దాయిగా బోనెక్కిన సావర్కర్‌ తిలక్‌ ద్వారా సంపాదించిన స్కాలర్‌షిప్‌తో ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్‌ వెళ్లాడు. సావర్కర్‌ ఆదేశంతో మదన్‌ లాల్‌ ఢింగ్రా అనే యువకుడు లండన్‌లోని ఉన్న ఇంగ్లీష్‌ తాధికారి కర్జన్‌ విల్లీని కాల్చిచంపాడు. బ్రిటిష్‌ పోలీసులు డింగ్రాను ఉరి తీశారు. సరైన సాక్ష్యం లేనందున సావర్కర్‌ ఆ కేసు నుండి బయటపడ్డాడు. సావర్కర్‌ ఎప్పుడూ తెరవెనుక సూత్రధారిగా ఉంటూ, ఆదేశాలు జారీ చేసేవాడు అని ప్రతీతి. ఆ తర్వాత లండన్‌ నుండి రెండు పిస్టళ్లను భారతదేశానికి పంపాడు. వాటిలో ఒక పిస్టల్‌తో ఇండియాలో జాక్సన్‌ అనే అధికారిని చంపారు. ఆ కేసులో అరెస్టు అవుతాననే ముందు జాగ్రత్తగా లండన్‌ నుండి పారిస్‌ వెళ్లాడు. అంతా సద్దుమ ణిగిందని భ్రమించి లండన్‌కు తిరిగి రాగా రైలు స్టేషన్‌లోనే బ్రిటిష్‌ పోలీసులు అరెస్టు చేసి ఇండియాకు తెచ్చి విచారణ జరిపారు.ఆయనకు రెండు యావజ్జీవ శిక్షలు, అంటే 50 ఏండ్ల శిక్షవేసి అండమాన్‌ జెయిల్‌కు పంపారు. కాని కొన్నేళ్లలోనే సావర్కర్‌ బ్రిటిష్‌ పాలకుల క్షమాబిక్ష పొందారు. తన దయా భిక్ష లేఖలో పేర్కొన్నట్లుగాన విడుదల తర్వాత సావర్కర్‌ ఏ బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటంలోనూ పాల్గొనలేదు.
మహాత్మాగాంధీ రత్నగిరి వెళ్లి సావర్కర్‌ను కలిసినా ఫలితం లేకపోయింది. ఘర్‌వాపసీ, అంటరానితనంపై గాంధీజీ ఆయన అభిప్రాయాలు అడిగారు. ఇద్దరి అభిప్రాయాల మధ్య పొందిక కుదర్లేదు. రత్నగిరి జిల్లాను దాటి వెళ్లరాదన్న ఆంక్షలు తొలిగాక బాంబొయి ప్రావియెన్స్‌, సెంట్రల్‌ ప్రావియెన్స్‌ల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సావర్కర్‌కు స్వాగత సభలు ఏర్పాటు చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌ స్వయంగా వాటిలో పాల్గొన్నారు. అయితే హిందూ మహాసభకు తాను అధ్యక్షుడయ్యాక. హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌లను విలీనం చేయాలని సావర్కర్‌ ప్రతిపాదించినా హెడ్గేవార్‌ ఒప్పుకోలేదు.
దేశ విభజనకు గాంధీ నెహ్రులు కారణమని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించినా వాస్తవం ఏమిటంటే సావర్కర్‌ 1923లోనే ”హిందూత్వం – ఎవరు హిందువులు” అన్న పుస్తకం రాశారు. అందులో ఇండియా హిందువులది మాత్రమేనని వాదించారు. దేశవిభజనకు ఆ పుస్తకంతో బీజం వేసినట్లయింది. ముస్లిం లీగ్‌ అధ్యక్షుడు మహ్మదలీలో జిన్నా 1940లో మాత్రమే భారత దేశాన్ని మత ప్రాతిపదికపై విభజించాలని కోరాడు. విభజించు -పాలించు వ్వూహాన్ని అనుసరించిన బ్రిటిష్‌ పాలకులకు కూడా కావాల్సింది అదే కాదా! వెళ్లే ముందు వారు దేశాన్ని విభజించి పెద్ద చిచ్చుపెట్టారు. భారతదేశం హిందువులదని, వారు మాత్రమే పూర్తి పౌరసత్వంలో దేశంలో ఉండాలని మిగతా మతాల వారు భారతదేశంలో ఉండదల్చితే రెండవ తరగతి పౌరులుగా మాత్రమే ఉండాలన్న వాదనను ఆర్‌ఎస్‌ఎస్‌ నాడు నేడు చేస్తోంది. సావర్కర్‌ ముందు హిందూ మహాసభ అధ్యక్షు డిగా ఉండిన మూంజే ఆర్‌ఎస్‌ఎస్‌ అభివృద్ధికి సహకరించాడు. మూంజె తాను ఇంగ్లండ్‌ వెళ్లి తిరిగొస్తూ ఇటలీలో ఆగాడు. ఫాసిస్ట్‌ పార్టీ అధ్యక్షుడు, నియంత అయిన ముస్సోలినీని, ఆ పార్టీ ఇతర నాయకులను కలిసి వచ్చాడు. వారి సూచనలను హిందూ మహాసభలోనూ, ఆర్‌ఎస్‌ఎస్‌లోనూ ఆయన అమలు చేశాడు.
ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉంటూనే 1938లో గాడ్సె అధికారికంగా హిందూ మహాసభలో చేరాడు గాడ్సె. ఒకే వ్యక్తి రెండు సంస్థ లోనూ సభ్యులుగా ఉండేవారు. తిలక్‌ మరణం తర్వాత చిత్పవన్‌ బ్రాహ్మణ అనుచరులు కాంగ్రెసును వదిలి ఆర్‌ఎస్‌ఎస్‌ లో చేరారు. స్వాతంత్య్రం తర్వాత బ్రాహ్మణాధిక్యతను పునరుద్ద రించాలని కోరుకొనేవారికి, వైశ్యుడైన గాంధీజీ కాంగ్రెస్‌కు నాయకుడు కావడం నచ్చలేదు. తిలక్‌ ప్రారంభించిన కేసరి పత్రిక మతవాదుల పత్రిక అయింది. అందులో నియంతృత్వాన్ని సమర్థిస్తూ వరుసబెట్టి వ్యాసాలు రాసేవారు. పూనాలోని తిలక్‌ స్మారక మందిరం కూడా హిందూ మతవాదుల అడ్డా అయింది. అక్కడ జరిగే సభల్లో గాడ్సె తాను ఆ ముసలాడిని (గాంధీజీని) చంపుతానని ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగించేవాడట. సావ ర్కర్‌ రత్నగిరిలో ఉన్నప్పుడు కుర్రవాడైన గాడ్సె కూడా అక్కడ ఉండేవాడు. గాడ్సె కూడా చిత్పవన్‌ బ్రాహ్మణుడే కనుక ఇద్దరి మధ్య గురుశిష్యు బంధం త్వరలోనే బలపడింది. కాని ఆ క్రమంలోనే తన కొడుకు మహాత్మాగాంధీనీ హత్య చేసి ఉరితీయబడతానని గాడ్సె తండ్రి ఆరోజు ఊహించలేడు కదా?
1946లో జరిగిన హిందూ మహాసభ సమావేశాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హిందూ మహాసభ చేరరాదన్న గాడ్సె వాదన వీగి పోయింది. ఇకనేం గాడ్సె సభకు అధ్యక్షత వహించిన ఎల్‌.బి.బోపాల్కర్‌పై కత్తి దూసి దాడి చేయబోయాడు. ఇత రులు అడ్డుకొని అధ్యక్షుడిని కాపాడారు. ఆ తీర్మానం ప్రకారమే శ్యామప్రసాద్‌ ముఖర్జీ నెహ్రు మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. తన తండ్రికి చేదోడుగా ఉండటానికి గాడ్సె టైలరింగ్‌ నేర్చికొని పూనాలో టైలర్‌ షాపు పెట్టాడు. అక్కడ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్య కలాపాల్లో పాల్గొనేవాడు. ఆ దర్జీ దుకాణం ఆర్‌ఎస్‌ఎస్‌కు ఒక అడ్డాగా మారింది. సావర్కర్‌ సాయంతో గాడ్సె, ఆప్టేలు హిందూ రాష్ట్రీయ దళ్‌ (హెచ్‌ఆర్‌డి) అనే సంస్థను నెలకొల్పి, అందులో సైద్ధాంతిక, శారీరక శిక్షణను ఇచ్చేవాడు. రైఫిల్‌ ఉపయోగిం చడం, గుర్రపు స్వారీ చేయడం వగైరా నేర్పేవారు. మతతత్వ మేధావులు హెచ్‌ఆర్‌డి క్యాంపులో ముస్లింలకు క్రైస్తవులకు వ్యతి రేకంగా ద్వేషం నూరి పోసేవారు. 1940లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల నిర్వహణను నిషేధించింది. కనుక ఆ సంస్థ సభ్యులు హెచ్‌ఆర్‌డి క్యాంపుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. ఆ తర్వాత సావర్కర్‌ సాయంతో గాడ్సె ఎడిటర్‌గా మొదట ”అగ్రణి” పత్రికను కొని నడిపాడు. దానికి జనరల్‌ మేనేజర్‌ ఆప్టే. దాని ద్వేషపూరిత రాతలపై బొంబాయి ప్రభుత్వం జుల్మా నాలు వేసేది. జుల్మానాలను మాఫీ చేయించుకోవడానికి గాడ్సె అప్పటి బొంబాయి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయిని కలిశాడు కూడా. ఆ జుల్మానాలను సావర్కర్‌ చెల్లించేవాడని దర్యాప్తులో బయట పడింది, జుల్మానాలను తప్పించుకోవడానికి ”అగ్రణి”ని మూసేసి మరో పత్రికను గాడ్సె, ఆప్టేలు ప్రారంభించారు.
గాంధీజీని చంపడానికి 1948 జనవరి 20న చేసిన మొదటి ప్రయత్నంలో గాడ్సె బృందం విఫలమైంది. హత్య చేయ డానికి వెళ్తూ గాడ్సె బృందం బొంబాయిలో ఆగి సావర్కర్‌ను కలిశారు. గాడ్సె, ఆప్టేలకు వీక్కోలు చెప్పడానికి మొదటి అంతస్తు నుండి దిగివస్తూ సావర్కర్‌ వారిని ‘విజయీభవ’ అని దీవించి నట్లు దర్యాప్తులో తెలిసింది. జనవరి 30వ తేది సాయంత్రం రెండవ ప్రయత్నంలో గాడ్సె నేరుగా గాంధీజీ ముందుకు వెళ్లి అతి దగ్గర నుండి కాల్పులు జరిపాడు. చని పోవడానికి ముందు గాంధీజీ బెంగాల్‌లోని నౌఖాలిలో మత ఘర్షణలను ఆపడానికి ఆమరణ విరాహరదీక్ష చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఢిల్లీలో కూడా అలాంటి పరిస్థితే తలెత్తిందని తెలిసి ఢిల్లీ వచ్చి అక్కడ నిరాహర దీక్ష మొదలెట్టారు. ఢిల్లీ పరిస్థితి అదుపులోకి వచ్చింది. రెండు పక్షాలవారు గాంధీజీ ముందు హింసాకాండను ఆపేస్తామని ప్రమాణాలు చేశారు.
గాంధీ హత్య వెనుక పెద్ద కుట్రే ఉందని గాడ్సె జేబులో దొరికిన ఒక నోట్‌బుక్‌ ద్రువపర్చింది. తాము పూణేలో హత్యా సన్నాహాలు ప్రారంభించినప్పటి నుండి దేనికి ఎంత ఖర్చు బెట్టింది ఎవరికి ఎంత ఇచ్చింది గాడ్సె రాసుకొన్నాడు. దాంతో కుట్రదారులందరినీ పోలీసులు కొద్ది గంటల్లోనే అరెస్టు చేయ గలిగారు. ఆ సందర్భంగా తాము సావర్కర్‌ను కూడా అరెస్టు చేయడానికి అనుమతి కోరినా ప్రభుత్వం అమోదం తెల్పలేదని ఒక దర్యాప్తు అధికారి ఆ తర్వాత తెలిపారు. సాయంత్రం 5.17 నిమిషాలకు హత్య జరిగింది. రాత్రి 10.30 వార్తల్లో గాంధీని చంపింది పూణే వాసి నాథురాం గాడ్సె అని రేడియోలో వెల్లడిం చారు. కోపొద్రిక్తులైన ప్రజలు దేశంలో అనేక చోట్ల ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభల కార్యాలయాలపై పడ్డారు. పూణేలోని గాడ్సె తమ్ముడి పరిశ్రమను తగలబెట్టారు. పూణే జిల్లా కలెక్టర్‌ ముందు జాగ్రత వల్ల గాడ్సె తల్లితండ్రులకు ప్రమాదం తప్పింది. బొంబాయిలో దాదాపు వేయిమంది కాగడాలతో సావర్కర్‌ సదన్‌ ను చుట్టుముట్టి తగలబెట్టడానికి ప్రయత్నించారు. పోలీ సులు సకాలంలో అక్కడికి చేరుకొని సావర్కర్‌ను అతని సదన్‌ నూ కాపాడారు. ఈ విషయం తెలుసు కొన్నప్పుడు గోద్రాలో జరిగిన ఘోరకృత్యం అనంతరం అహ్మదాబాద్‌లో ముస్లింలపై జరిగిన మారణకాండ ఎవరికైనా గుర్తుకు వస్తుంది. మహాత్మాగాంధీ అంతటి నాయకుడి హత్య తర్వాత చెలరేగిన కోపాగ్నిని అప్పటి ప్రభుత్వాలు కొద్దిపాటి నష్టంలో చల్లార్చాయి. కాని అహ్మదాబాదు లో జరిగిందేమిటి? వేలాది మంది చనిపోయాకే అహ్మదాబాదు వీధుల్లోకి చేరిన సైన్యం వెళ్లింది. ఇందిరాగాంధీ హత్య అనం తరం ఢిల్లీలో సిక్కులపై సాగిన హింసాకాండ కూడా అలాంటిదే. మానవ హక్కుల పట్ల చిత్తశుద్ధి లేని ఇలాంటి ప్రభుత్వాలే గాంధీజీ హత్య జరిగినప్పుడు ఉంటే ఎంత జననష్టం, ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో! హత్య చేయడానికి చాలా కాలం ముందే గాడ్సె తను సంస్థలో లేడని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించినా నాగ్‌పూర్‌ లోని ఆ సంస్థ కార్యాలయంలో సోదా సందర్భంగా లభించిన మినిట్స్‌ పుస్తకంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుల సమావేశంలో గాడ్సె పాల్గొన్నట్లు నమోదై వుంది.
(అక్టోబరు 02 గాంధీ జయంతి)
ఎస్‌. వినయకుమార్‌