పవన్ కల్యాణ్ ఎన్నికపై అభిమానుల సంబురాలు..

నవతెలంగాణ – బెజ్జంకి 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొణిదేల సీని నటుడు పవన్ కల్యాణ్ ఎన్నికవ్వడంతో మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద అయన అభిమానులు టపాసులు కాల్చి మంగళవారం సంబురాలు జరుపుకున్నారు. భవిష్యత్తులో పవన్ కల్యాణ్ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నత పదవులు పొందాలని బోనగిరి మల్లేశం అకాంక్షించారు.చేరుకూరి సాయి క్రిష్ణ,మహేశ్,వీరేశం, శ్రీనివాస్,సునీల్,ప్రశాంత్,కొత్తగట్టు శ్రీనివాస్,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.