కావేరీ సీడ్‌ కంపెనీని సందర్శించిన ఎఫ్‌ఎఒ డిజి

హైదరాబాద్‌ : ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎఒ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ క్యూ డోంగ్యు ప్రతినిధి బృందం కావేరీ సీడ్‌ కంపెనీని సందర్శించారు. డోంగ్యు బృందానికి తమ కంపెనీ గురించి కావేరీ సీడ్స్‌ సిఎండి జివి భాస్కర్‌ రావు వివరించారు. భారతదేశ వ్యవసాయానికి కావేరీ విత్తన కంపెనీ గణనీయమైన సహకారాన్ని, అతిపెద్ద విత్తన ఉత్పత్తిదారుగా దాని పాత్రను తెలిపారు. హరిత విప్లవం, వ్యవసాయ సమాజానికి కావేరీ విత్తనాలు అందించిన గణనీయమైన కృషిని డోంగ్యు ప్రశంసించారు.