10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ 

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదవ తరగతి విద్యార్థుల చేత శుక్రవారం  ఘనంగా వీడ్కోలు సమావేశం  ఏర్పాటు చేశారు.ఈ వీడ్కోలు సమావేశం సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఉదయం వేళలో సరదాగా   కొన్ని గేమ్స్ ఆడించారు. అనంతరము పదవ తరగతి  2023-24 బ్యాచ్ గ్రూప్ ఫోటోను దిగారు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమావేశంలో త్వరలో  పాఠశాల విద్యను పూర్తి  చేసుకొని  వెల్లబోతున్న  విద్యార్థులు మాట్లాడుతూ మాకు  ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యాబుద్ధులు చెప్పిన పాఠశాల టీచర్స్ ను  ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి కి బోధించిన   ఉపాధ్యాయులు  పదవ తరగతిలో అత్యధిక జి.పి.ఏ సాధించడానికి  సలహాలను టెక్నిక్స్ వివరించారు. అనంతరం పాఠశాల హెచ్.ఎం. నాంపల్లి మల్లేశం మాట్లాడుతూ పదవ తరగతిలో అత్యధిక జి.పి.ఏ సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు పరీక్షలు అంటే భయపడద్దని భయం వీడితేనే జయం కలుగుతుందన్నారు అందుకని ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మ విశ్వాసం తో ఉండి  మహత్తర కార్యాలు సాధించాలన్నారు.విద్యార్థులు చేసిన స్కిట్స్,సాంసృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి..ఈ కార్యక్రమంలో గజిటెడ్ హెడ్మాస్టర్స్ క్యాదారి.రాజేందర్, సామల పట్టాభి, టీచర్స్ సాహిన్ బేగం, సబియా సిద్ధికి సంగీత, బుజ్జయ్య ,షాహిన్ ఫాతిమా బుతూల్ ఫాతిమా, నవీద్ నస్రీన్ ,రమేష్,బాలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.