పది విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

Ramagiriనవతెలంగాణ-రామగిరి 
కృష్ణవేణి టాలెంట్ స్కూల్ & హిల్-ఫోర్ట్ హై స్కూల్ లు సంయుక్తంగా రామగిరి మండల లోని కల్వచర్ల లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కల్వచర్ల తాజా మాజీ సర్పంచ్  గంట పద్మ-వెంకటరమణరెడ్డి, పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ఎంఎ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, రామగుండం మండల టిఆర్ఎస్ఎంఏ అధ్యక్షులు సమ్మారావు, పెద్దపల్లి టిఆర్ఎస్ఎంఏ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి  పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో 9, 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు సాంప్రదాయ దుస్తులలో వచ్చి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంను ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్  తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, 10వ తరగతి  విద్యార్థులు పబ్లిక్ పరీక్షలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించ వలసిన మెళకువలను వివరించి, ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, మీ తల్లదండ్రులకు, ఉపాధ్యాయులకు, మీరు చదివే పాఠశాలకి మంచి పేరు తీసుకువచ్చి, మీరు మీ జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బర్ల. శ్రీనివాస్, డైరెక్టర్స్ శ్రీధర్ బాబు, అనిల్ కుమార్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు  విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.