అనాజిపురంలో గ్రామపంచాయతీ పాలకవర్గం వీడ్కోలు సమావేశం….

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో ఈరోజు గ్రామపంచాయతీ పాలకవర్గ వీడ్కోలు సమావేశంలో శుక్రవారం నిర్వహించగా, గ్రామ సర్పంచ్ (సిపిఎం నాయకురాలు) ఏదునూరి ప్రేమలత మల్లేశమును ఎంపీటీసీల జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన శ్రీనివాస్  పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో గ్రామ ఉప సర్పంచ్   మైలారం వెంకటేశము,  వార్డ్ మెంబర్లు కో ఆప్షన్ మెంబర్లు గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారని, ఈ ఐదేళ్లలో పాత ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి,  ఎంపీ కోమటిరెడ్డి, ప్రజెంట్ ఎమ్మెల్యే అనిల్ రెడ్డి లు   అభివృద్ధికి సహకరించారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు.