ఘనంగా ఎంపీటీసీల వీడ్కోలు సభ..

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలో గల స్థానిక మండల పరిషత్ ఆవరణలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలను, ఎంపీడీవో మరియు మండల పరిషత్ సిబ్బంది, కార్యదర్శులు అందరు కలిసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ లతా కన్నీరo మాట్లాడుతూ ముందుగా తనని గెలిపించిన కులాస్పూర్ గ్రామ ప్రజలకు మరియు కులాస్పూర్ తాండ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అనేక వాగ్దానాలను ఆ గ్రామానికి ఇవ్వడం జరిగిందని కానీ నేను ఎంపీపి పదవి చేపట్టిన తర్వాత అరకురా నిధులతో నేనిచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేరుతుందని నమ్మకం నాకు కలగలేదని కానీ తన మామయ్య అయినటువంటి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ఆర్ అండ్ బి ఈ ఎన్ సి గా పనిచేస్తున్న మోహన్ నాయక్ కృషితో దాదాపు 50 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి సొంత మండలం తో పాటు పక్క మండలం కూడా నిధులు ఇప్పించడం జరిగిందని ఆమె తెలిపారు. కచ్చితంగా నేను ఈ ఐదు సంవత్సరాల నా పదవి కాలంలో ప్రజలకు న్యాయం చేశాను అని నమ్మకం అయితే నాకు ఉందని కాకపోతే మధ్యలో కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఇబ్బంది గురి అయ్యామని ఆమె తెలిపారు. అలాగే నాకు బీఫామ్ అందించి ఎంపీపీగా చేసిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నని ఆయన దయ వల్లనే ఈ రోజు నేను ఈ క్రొత్త  మండలనీకి  తొలి ఎంపీపీగా అయ్యానని ఆయన కృషిని నేను జీవితంలో మర్చిపోలేని ఆమె తెలిపారు.
అన్వేక కారణాలవల్ల కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని ఇక్కడ కూడా  ప్రస్తుత ఎమ్మెల్యే భూపతిరెడ్డి కూడా చాలా గౌరవంగా చూసుకుంటున్నారని ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఆమె మాట్లాడుతూ ఎంపీటీసీ వ్యవస్థ రాను రాను అద్వానంగా తయారవుతుందని కనీసం గ్రామంలో ఒక ఎంపీటీసీకి గౌరవం కూడా లేకుండా పోతుందని నిధులు ఎలాగో లేవు కనీసం ఒక గ్రామ పంచాయతీలలో కూర్చి కూడా ఉండటం లేదని వారి ఆవేదనను ఇప్పుడైనా అర్థం చేసుకొని  ఎన్నికల తర్వాత వచ్చే ఎంపీటీసీల కైనా గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని అరకుర నిధులు కాకుండా కనీసం గ్రామ సమస్యలను తీర్చే విధంగా నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విధంగా చూడాలని ఆమె ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శిలు సర్పంచ్ కి ఏ విధమైన గౌరవం ఇస్తారో అలాగే ఎంపీటీసీల కూడా అదే గౌరవం ఇవ్వాలని వారిని కోరారు. మళ్లీ అవకాశం వస్తే ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేస్తానని కచ్చితంగా మోపాల్ మండలన్ని రాష్ట్రంలోని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని సభాముఖంగానే తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన మహిళా కార్యదర్శిలు ఎంపీపీ దంపతులను సన్మానించడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఎంపీడీవో లింగo నాయక్ మాట్లాడుతూ నేను ఈ మండలానికి ఎంపీడీవో వచ్చిన రెండు సంవత్సరాలు అయిందని ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు అందరూ చక్కగా సహకరించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎంపిటిసి లకు సరైన నిధులు ఇవ్వక  అలాగే మండల పరిషత్ లకు కూడా సరియైన నిధులు లేక వారు ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు. కానీ ఇక్కడున్న ఎంపీటీసీ లందరూ ఇంకా భవిష్యత్తులో వారు ఉన్నత పదవులు పొందాలని ప్రజాసేవలో వారుండాలని ఆయన కోరుకున్నారు. అలాగే మీరు పదవిలో ఉన్నా లేకున్నా ఇంతకుముందు మిమ్మల్ని ఏ విధంగా అయితే గౌరవించామో అలాగే తర్వాత కూడా నేను కానీ మా సిబ్బంది కానీ గౌరవిస్తామని ఆయన తెలిపాడు.  ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల  రాష్ట్ర అధ్యక్షుడు మరియు మోపాల్ మండల కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మోపాల్ మండలంలో ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకత ఉందని ఎందుకంటే ఇక్కడ ఎంపీపీ కూడా మహిళ అని వైస్ ఎంపీపీ కూడా మహిళని జెడ్పిటిసి కూడా మహిళ నే ఉండడం జిల్లాలోనీ అన్ని మండలాలలోకెల్లా ఈ మండలo ప్రత్యేకత అని ఆయన తెలిపారు. ఇక్కడ ఎంపీపీ లతా కన్నీరం గురించి మాట్లాడుతూ   తన ఇంటిని ఎలా చక్కబడుతుందో మండలంలోని ప్రజల సమస్యలను కూడా అలాగే చక్క దిద్దుతూ వారికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించిందని  ఈ మండలం కొత్తగా ఏర్పడడం  వల్ల కొన్ని ఇబ్బందులు కలిగాయని కానీ మన ఎంపీపీ లతాకాన్నిరం మాత్రం అవన్నీటిని ఎదుర్కొంటూ మండల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఆమె చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనిత ప్రతాప్, ఎంపీటీసీలు సంగ్య నాయక్, సిర్పూర్ ఎంపిటిసి రఘు, మోపాల్ ఎంపీటీసీ ముత్యం, రాములు, పల్లికొండ రమేష్, వివిధ గ్రామల ఎంపీటీసీలు అలాగే మాజీ సర్పంచ్ ముత్యం రెడ్డి, నాయకులు సతీష్ రెడ్డి,  మండల సిబ్బంది ప్రదీప్, ప్రియాంక, సునీత, కార్యదర్శులు మృదుల, ధీరజ్, నవీన్, హరీష్, భార్గవ్, సాయి, చైతన్య, శ్యామ్, స్వప్న, ఆర్మీ రాజు తదితరులు పాల్గొన్నారు.