ఉపాధ్యాయులకు విద్యార్థుల వీడ్కోలు

Farewell of students to teachersనవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలోని మారుతి నగర్ మండల ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు గురువారం విద్యార్థులు వీడ్కోలు తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించిన చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ ఇతర పాఠశాలలకు బదిలీ అయ్యారు. వీరికి పాఠశాల విద్యార్థులు తమకు ఉత్తమ విద్యా బోధన అందించి, బదిలీపై వెళ్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపి వీడుకోలు పలికారు. సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.