
నిజామాబాద్ హోమ్ గార్డ్సు విభాగంలో మార్చ్ 1న పదవి విరమణ చేయడం జరిగింది. వారి వివరాలు నిజామాబాద్ పోలీస్ కార్యాలయం నుండి విడుదల చేశారు. బి. సాయన్ రావ్, హోమ్ గార్డు నెంబర్ 554, హోమ్ గార్డు కార్యాలయం,నిజామాబాద్ హోమ్ గార్డు శాఖలో పదవి విరమణ పొందినారు. ఈ మేరకు శుక్రవారం పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వ హించడం జరిగింది. వీరికి శాలువలతో సత్కరించి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్ మాట్లాడుతూ.. ఎలాంటి రిమార్కు లేకుండా పదవివిరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని, మీరు డిపార్టుమెంట్ కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని, పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మరియు మీ కుటుంభ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోళ్లు సందర్భంగా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వు ఇన్స్పెక్టర్స్ వెంకట్, రమేష్, హెడ్ కానిస్టేబుల్ గోపాల్, కంపెనీ కమాండర్ శ్రీ సయ్యద్ బషీర్ అన్వర్ వారి కుటుంబ సభ్యులు హజరుకావడం జరిగింది.