స్థానిక కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో పదవ తరగతి విద్యార్థులకు శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానకి వరంగల్ నిట్ ప్రొఫెసర్ డాక్టర్ చెరుకు రామలింగస్వామి ముఖ్య అతిధిగా హాజరు అయి విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత, జీవితంలో వాళ్ళ లక్ష్యంను ఎలా చేరుకోవాలో దిశా నిర్దేశం చేసారు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో ఉండి చదివినట్టు అయితే జీవితంలో మీ లక్ష్యంను చేరుకోవొచ్చ అని జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి మెలుకువలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ గొట్టి పర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ ఈ పోటీ ప్రంపంచంలో కష్టపడి చదివి నాట్లైత్ ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు అని తెలియచేసారు. పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ మహబూబ్ అలీ మాట్లాడుతు పాఠశాల ప్రాముఖ్యతను తెలియచేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆట పాటలతో ఘనంగా సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జి కే. శేఖర్ రెడ్డి, పాఠశాల ఇంచార్జ్లు కే. స్వప్న, సరిత, వైస్ ప్రిన్సిపాల్ మిల్క్ రాజు, ఉపాధ్యాయని ఉపాధ్యాయూలు శేఖర్, చారీ, తాజోద్దీన్, పాల్గొన్నారు.