మాజీ సర్పంచ్ కి.. ఆత్మీయ వీడ్కోలు

నవతెలంగాణ –  మహాముత్తారం
గ్రామ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించి, అభివృద్ధి పథంలో తమ గ్రామాన్ని ముందుంచిన  రెడ్డిపల్లి సర్పంచ్ అజ్మీర విమల పుల్ సింగ్ నాయక్ కీ  గ్రామస్తులు ఆత్మీయ వీడ్కోలు తెలిపి, సన్మానించారు. ఫిబ్రవరి 1 నాటికి పదవీ కాలం పూర్తి అయిన రెడ్డిపల్లి సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు హాజరై మాట్లాడారు.. గ్రామంలో ప్రజా సేవ చేస్తే గుర్తింపు తప్పకుండా ఉంటుందని అన్నారు. సర్పంచ్ విమల పూల్సింగ్ నాయక్ మాట్లాడుతూ..గతంలో కనుకునూరు గ్రామ పంచాయతీ లో హాబిటేషన్ గా ఉన్న సమయంలో నిధులు విడుదల కాక అభివృద్ధి జరగలేదని ప్రస్తుతం గ్రామ పంచాయతీ గా ఏర్పడి నిధులు రావడంతో చిరకాలం నిలిచే పనులు చేపట్టామనే తృప్తి మిగిలిందని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. నూతన పంచాయతీకి  నూతన సర్పంచ్ విమల అని అన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాలు గ్రామ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన  వెనకడుగు వెయ్యకుండా ఆర్థికంగా నష్టపోయినప్పటికీ తమ గ్రామంలో నిర్వహించే ప్రతి పథకంలో ముందుండి గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషిచేసిన సర్పంచ్ అజ్మీర విమల పులుసుకి ఎన్నడు గ్రామ ప్రజలు మర్చిపోలేరని ఈ సందర్భంగా వారు అన్నారు.అలాగే జిల్లా,  మండల స్థాయిలో ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న అన్ని శాఖల అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.